Friday, April 26, 2024
- Advertisement -

సికింద్రాబాద్ విధ్వంసం వెనుక.. పెద్ద కుట్రే ఉందా ?

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం పై చెలరేగుతున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. మొదట బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో మొదలైన వ్యతిరేకత ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరించింది. అగ్నిపథ్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కారులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల పైకి వచ్చి అల్లర్లు చేస్తూ నానా రచ్చ చేస్తున్నారు. అసలు అగ్నిపథ్ పథకంలో ఉండే లాభ నష్టాలను బేరీజు వేయకుండానే ఈ స్థాయిలో అల్లర్లు చెలరేగడం వెనుక రాజకీయ కోణం ఉందనే వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. అయితే మొదట్లో బిహార్ రాష్ట్రంలో మొదలైన ఈ వ్యతిరేకత ప్రస్తుతం సికింద్రాబాద్ లో ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టే వరకు వచ్చింది..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందల మంది ఆందోళన కారులు దాదాపుగా 10 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ ఆస్తులైన రైళ్లను తగలబెట్టారు. ప్రస్తుతం ఇదే దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే తెలంగాణలో చాలా ఉద్యమలే జరిగినప్పటికి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేంత ఉద్యమాలు జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతో మంది తమకు తాము ప్రాణాలు అర్పించుకున్నారు తప్పా. ఈ స్థాయిలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు. ఇటీవల కాలంలో ఉద్యోగాల కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు గాని ఈ స్థాయిలో అల్లర్లు సృష్టించలేదు. అలాంటిది ఆర్మీ ఉద్యోగాల కోసమంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీ విధ్వంసానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని వెనుక పెద్ద కుట్రే ఉందనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.

ఎందుకంటే తెలంగాణ పోలీసులు దేశం లోనే నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నారని సి‌ఎం కే‌సి‌ఆర్ పదే పదే చెబుతూ ఉంటారు. టెక్నాలజీ వాడకంలోను హైదరబాద్ పోలీసులు ముందంజ లోనే ఉన్నారు. హైదరబాద్ అంతా సి‌సి కెమెరాలతో ప్రతి క్షణం నిఘా పెట్టె పోలీసులు.. అత్యంత భద్రత ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోకి వందల మంది ఆందోళనకారులు వచ్చి విధ్వంసం సృష్టిస్తుంటే గమనించలేకపోయారా ? అనే అనుమానాలు వస్తున్నాయి. ఆందోళనలు ఉదృతం అవుతాయని తెలిసినప్పటికి హదరాబాద్ పోలీసులు కావాలనే చూసి చూడనట్లుగా వ్యవహరించరానే ఆరోపణలు వస్తున్నాయి. అగ్నిపథ్ పథకాన్ని కావాలనే విద్యార్థులకు వ్యతిరేక కోణంలో జోప్పిస్తున్నారని, కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది కోసమే దేశంలో అల్లర్లు సృష్టించేందుకు అగ్నిపథ్ ను వాడుకుంటున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓవరాల్ గా ఈ మొత్తం కాంట్రవర్సీ ని గమనిస్తే ఈ అల్లర్ల వెనుక అంతర్లీనంగా రాజకీయ కుట్ర దాగిఉందనే విషయం స్పష్టంగా అర్థమౌతుంది.

ఇవి కూడా చదవండి

అతి త్వరలో 4జి కి గుడ్ బై ?

“అగ్నిపథ్” పై రచ్చ.. అసలేంటి ?

విద్యుత్ సంక్షోభంలో ఆస్ట్రేలియా.. భారత్ కు పెను ముప్పు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -