అతి త్వరలో 4జి కి గుడ్ బై ?

- Advertisement -

ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా ఇంటర్నెట్ తో పాటు వేగంగా పరుగులు తీస్తోంది. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మానవుడు అప్డేట్ అవుతున్నాడు. ఒకప్పుడు ఏదైనా సమాచారాన్ని తెలుసుకోవాలంటే టీవీల ద్వారానో లేదా వార్తా పత్రికల ద్వారానో లేదా బుక్స్ ద్వారానో తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా ప్రపంచ నలుమూలల జరిగే అన్నీ విషయాలను క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఈ విధంగా సమాచారాన్ని మానవుడికి చేరవెయ్యడంలో ఇంటర్నెట్ స్పీడ్ కూడా కీ రోల్ పోషిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలలో ఇంటర్నెట్ స్పీడ్ అప్ గ్రేడ్ 5జి సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రస్తుతం మన దేశం లో 4జి సేవలే ఉన్నప్పటికి రాబోయే రెండు సంవత్సరాల్లో 5జి సేవలు దేశమంత విస్తరించే అవకాశం ఉంది. దీనికి సంభంధించి భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ తాజాగా పలు విషయాలు వెల్లడించింది. అతి త్వరలోనే భారత్ లో 5జి సేవలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. 4జి నెట్వర్క్ కన్నా..5జి నెట్వర్క్ 10 రేట్లు వేగంగా పని చేస్తుందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

అలాగే ముందు రోజుల్లో రాబోయే ఈ 5జి సేవలు ఎంటర్ ప్రైజెస్ కు అదనంగా ఆదాయాన్ని అందించే అవకాశం ఉందని భారత కమ్యూనికేషన్ల మంత్రిత్వా శాఖ తెలిపింది. దీనికి సంభందించిన వేలం జూలై లో జరిగే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి కేవలం 4జి నెట్వర్క్ తోనే ఇంటర్నెట్ ను అత్యధికంగా వినియోగించే దేశాల జాబితాలో మనదేశం టాప్ 5లో కొనసాగుతోంది. మరి 5జి నెట్వర్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

విద్యుత్ సంక్షోభంలో ఆస్ట్రేలియా.. భారత్ కు పెను ముప్పు ?

లైసన్స్ లేకున్నా.. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు !

చైనా అధ్యక్షుడికి నో రిటైర్మెంట్ ..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -