తమ్మినేని దారుణ హత్య .. ఊహించని ట్విస్ట్ !

ఖమ్మం జిల్లాలోని తెల్దరుపల్లి గ్రామానికి చెందిన టి‌ఆర్‌ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య ఇటీవల దారుణ హత్య కు గురైన సంగతి తెలిసిందే. ఖమ్మం రూరల్ మండలం లోని పోనేకల్లు వద్ద రైతు వేదికలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన..తిరుగి వస్తుండగా కొందరు దుండగులు వేట కొడవళ్ళతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. బైకు పై తన అనుచరుడితో కలిసి వెళ్తున్నా తమ్మినేనిని ఆటోలో వెంబడిస్తూ వెళ్ళిన దుండగులు తెల్దరు పల్లి డబుల్ బెడ్ రూం ఇళ్ల దగ్గర ఆటో తో బైకు ను ఢీ కొట్టి కిందపడిన ఆయనను వేట కొడవళ్ళతో విచక్షణ రహితంగా దాడి చేశారు. చేతులు నరికి, తలపై దారుణంగా దాడి చేసి ఛిద్రం చేశారు.

ఒకప్పుడు సిపిఎం నేతగా ఉన్న కృష్ణయ్య ఆ పార్టీని వీడి టి‌ఆర్‌ఎస్ లో చేరారు. ఆ తరువాత గ్రామలో పార్టీ బలోపేతం చేస్తూ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ప్రత్యర్థులు ఓర్వలేక తమ్మినేని కృష్ణయ్యను హతమార్చి ఉంటారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

అయితే తమ్మినేని హత్య గావించేటప్పుడు ఆయనతో పాటు వచ్చిన అనుచరుడు ముత్తేశం హత్య చేసిన వారి పేర్లు బయటపెట్టి మరో సంచలనానికి తెరతీశాడు. కృష్ణయ్యను చంపేందుకు ఆటోలో ఆరుగురు వచ్చారని, వారు గజ్జి కృష్ణస్వామి, నూకల లింగయ్య, బోదభట్ల శ్రీను, నాగేశ్వరరావు లని తెలిపాడు. దీంతో ఫోలిటికల్ కృష్ణయ్య హత్య హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

Most Populer

Recent Posts