Wednesday, April 24, 2024
- Advertisement -

బ్రిటన్ ఎలక్షన్స్ : రిషి సునక్ ఓటమికి ప్రధాన కారణం అదే !

- Advertisement -

ఎప్పుడు లేని విధంగా ఈ సారి బ్రిటన్ ఎన్నికలు మనదేశంలో ప్రాధాన్యం సంతరించుకున్న విషయం తెలిసిందే. దీనికి కారణం కూడా లేకపోలేదు.. ఎందుకంటే భారత సంతతికి చెందిన రిషి సునక్ ఈసారి బ్రిటన్ ప్రధాని రేస్ లో ఉండడంతో యావత్ భారతీయులంతా సహజంగానే రిషి గెలవాలని గట్టిగానే కోరుకున్నారు. ఇక మొదటి నుంచి కంజర్వేటివ్ పార్టీ నుంచి ఎంపీల మద్దతు కూడా రిషికి భారీగానే ఉండడంతో బ్రిటన్ ప్రధానికి భారత సంతతికి చెందిన రిషి గెలుపు దాదాపుగా ఖాయమే అనే భావనకు వచ్చారంతా. కానీ ఊహించని విధంగా రిషికి షాక్ తగిలింది. ప్రధాని రేస్ లో ఉన్న మరో కంజర్వేటివ్ పార్టీ నేత లీజ్ ట్రస్ అనూహ్యంగా పుంజుకొని ఏకంగా బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైంది. .

లీజ్ ట్రస్ చేతిలో 21 వేల ఓట్ల తేడాతో రిషి ఓటమిపాలు అయ్యారు. మరి మొదటి నుంచి ప్రధాని రేస్ లో ఉన్న రిషి ఎందుకు ఓటమిపాలు అయ్యారు ? రిషి చేసిన పొరపాటు ఏంటి ? అనే ప్రశ్నలకు విశ్లేషకులు చెబుతున్నా వివరణ ఏంటో ఒకసారి చూద్దాం..! మొదట ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ కరోనా సమయంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆయనను ప్రధాని పదవి నుంచి గద్దె దించాలని బ్రిటన్ కంజర్వేటివ్ పార్టీ ఎంపీలు ఒక్కక్కరుగా రాజీనామా చేస్తూ వచ్చారు. ముందుగా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్న రిషి సునక్ రాజీనామాతోనే బోరిస్ జాన్సన్ పతనం స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో రిషి పై బోరిస్ జాన్సన్ గట్టిగానే విమర్శలు చేశారు. రిషి సునక్ ఒక వెన్నుపోటు దారుడని అతడిని తప్పా ఇంకేవ్వరినైనా ప్రధానిగా ఎన్నికోవాలని మాజీ ప్రధాని బోరిస్ సూచించడంతో.. బోరిస్ చేసిన వ్యాఖ్యలు కంజర్వేటివ్ పార్టీ ఎంపీలపై తీవ్ర ప్రభావం చూపయని, పైగా ఆ పార్టీలో బోరిస్ కు అనుకూల మద్దతుదారులు కూడా అధికంగా ఉండడంతో రిషిని వెన్నుపోటుదారుడిగా ప్రకటించడంలో సక్సస్ అయ్యారు.. ఇదే రిషి ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఇదే సమయంలో మరో ప్రధాని అభ్యర్థి లీజ్ ట్రస్ పన్నుల భారాన్ని తగ్గిస్తానని గట్టిగా చెప్పుకొచ్చింది. కానీ రిషి మాత్రం పన్నుల తగ్గింపుపై పెద్దగా స్పందించలేదు. దాంతో లీజ్ ట్రస్ కు అనూహ్యంగా మద్దతు పెరిగింది. ఇక రిషి ఓటమిలో మరో అంతర్గత కారణం అతను భారత సంతతికి చెందిన వాడు కావడం.. బ్రిటన్ కంజర్వేటివ్ పార్టీలో సహజంగానే వారి స్వదేశానికి చెందిన వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో స్వదేశానికి చెందిన వారిని కాకుండా భారత సంతతికి చెందిన రిషి సునక్ ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడంలో కంజర్వేటివ్ పార్టీ ఎంపీలు కాస్త వెనుకడుగు వేశారని, అందుకే రిషిని కాదని లీజ్ ట్రస్ కు అనూహ్య గెలుపు కట్టబెట్టరాని విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్ ను చూడాలనుకున్న ఇండియన్స్ కల చెదిరిపోయిందనే చెప్పాలి.

Also Read : రష్యాకు వ్యతిరేకంగా భారత్.. అసలెందుకు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -