Friday, May 10, 2024
- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంలో ముఖ్య పాత్ర ఈయనదేనట..!

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారం కేసులో ఇద్దరు ముఖ్యమంత్రులు కాంప్రమైజ్ అయ్యారని పలు పుకార్లు వస్తునాయి. కానీ ఏసిబి మాత్రం ఈ కేసులో రోజూ ఓ కొత్త విషయాన్ని బయటపెడుతోంది.   మొన్న తాజాగా ఈ కేసులో మరో కొత్త పేరు ’జిమ్మీ బాబు’ పేరు బయటికి వచ్చింది.

ఇప్పుడు తాజాగా మళ్ళీ సండ్ర వెంకట వీరయ్య రిమాండ్ రిపోర్టులో మరో కొత్త పేరును తెలంగాణ ఏసిబి ప్రస్తావిస్తోంది.

ఆ పేరేంటంటే సండ్ర జనార్దన్.. ఈ కేసులో ప్రతి విషయము సండ్ర జనార్దన్ దృష్టికి వెళ్ళిందని, అసలు సండ్ర జనార్దన్ ఎవరో తేల్చాల్చిన అవసరం ఉందని ఏసిబి పేర్కొంది. ఈ వ్యవహారంలో ఏ2 నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఎమ్మెల్యే సండ్రలు మే 27 నుంచి 31 మధ్య 22 సార్లు ఫోన్లో మాట్లాడుకున్నారని వీటిలో సండ్ర జనార్దన్ పేరు వినిపించిందని ఏసిబి పేర్కొంటోది. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌లోని రిపోర్ట్ ప్రకారం సెబాస్టియన్, సండ్ర వెంకట వీరయ్య రెండు ఫోన్ నంబర్లలో మాట్లాడుకున్నారట.. ఆ రెండు నంబర్లు 8790825678, 9440625955 ఇవే.. ఈ నంబర్లు సండ్ర వెంకట వీరయ్యకు సంబందించినవేనటా..    అలాగే ఎన్‌టిఆర్‌ ట్రస్ట్ భవన్‌లో కీలక భేటీలు జరిగాయని వెల్లడించిన ఏసిబి, మొత్తం వ్యవహారాన్ని సడిపించింది సండ్రేనని, కానీ ముప్పై తేదీ మాత్రం రేవంత్‌ని రంగంలోకి దింపారని ఏసిబి తెలిపింది.

 

ఓటుకు నోటు కేసు వ్యవహారం ఏమవుతుందో ఎమో తెలీదు కానీ రోజూ ఓ కొత్త విషయం కేసులో బయటికి వస్తోంది. 

 

  

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -