Thursday, April 25, 2024
- Advertisement -

మాజీ పోలీస్‌ కమిషనర్‌ పై వేటు కి సీబీఐ సిద్ధమవుతోంది..!

- Advertisement -

బెంగాల్ లో లక్షల మంది ప్రజలను వంచించి రూ.2500 కోట్లకు పైగా కుంభకోణానికి పాల్పడిన శారదా గ్రూప్‌ కంపెనీల కేసులో కోల్‌కతా మాజీ పోలీస్‌ కమిషనర్‌, ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ కుమార్‌ను మరోసారి విచారించేందుకు సీబీఐ సమాయత్తమవుతోంది. రాజీవ్ ‌కుమార్‌ను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పొంజి పథకాల కేసుపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. 2013లో రాజీవ్‌ కుమార్‌ బిదాన్‌నగర్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న సమయంలో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బంగాల్‌ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందంలో రాజీవ్‌ కుమార్‌ కూడా సభ్యుడు. ఈ కేసు దర్యాప్తును 2014లో సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దర్యాప్తునకు రాజీవ్‌ కుమార్‌ సహకరించటంలేదని, ఆయనను మరోసారి ప్రశ్నించాల్సి ఉందని పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -