Wednesday, April 24, 2024
- Advertisement -

కాంగ్రెస్ నాయకుడికి సీబీఐ సమన్లు..!

- Advertisement -

కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్‌కు సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అక్రమాస్తుల కేసులో తనకు నవంబర్‌ 19న సమన్లు వచ్చాయని, ఆ సమయంలో తామెవరూ ఇంట్లో లేనట్టు ఆయన తెలిపారు. మరుసటి రోజు ఉదయం ఇంటికి వచ్చేసరికి అధికారులు సమన్లు ఇచ్చారని వివరించారు.

నవంబర్‌ 19న శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యకు బిజేపి సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ మనవడు, కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్యతో నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్‌ 5న కర్ణాటక, ఢిల్లీ, ముంబయిలలో డీకేఎస్‌తో పాటు పలువురికి సంబంధం ఉన్న 14 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.

ఈ సందర్భంగా రూ.57లక్షల నగదుతో పాటు పలు దస్త్రాలు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు. అలాగే, శివకుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అక్రమాస్తుల ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

టీఆర్ఎస్ వ్యూహాన్ని మార్చే టైం వచ్చిందా..?

టీడీపీ చేతుల్లోంచి ఆ వర్గాన్ని తెలివిగా లాక్కున్న వైసీపీ..?

చినబాబు ఇక ఇంటికే పరిమితమా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -