Friday, April 26, 2024
- Advertisement -

కర్షకుల చెంతకి కేంద్రం..!

- Advertisement -

నూతన వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల ప్రతినిధులతో కేంద్రం నేడు మరోసారి చర్చలు జరపనుంది. ఈనెల 1న జరిపిన చర్చల్లో చట్టాలపై అభ్యంతరాల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రులు చేసిన ప్రతిపాదనకు రైతు ప్రతినిధులు నిరాకరించారు.


ఇవాళ రైతులతో రెండో విడత చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్‌తో బుధవారం భేటీ అయ్యారు. రైతులు లేవనెత్తిన సమస్యలపై నిర్మాణాత్మకంగా ఎలా స్పందించాలనే అంశంపై సమాలోచనలు జరిపారు.

ఇవాళ రైతులతో చర్చలకు ముందు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌తో అమిత్ షా భేటీ కానున్నట్లు సమాచారం. కొన్నిరోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా ఈ ఉదయం ఇరువురి మధ్య సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -