Thursday, May 23, 2024
- Advertisement -

బాబుకు షాక్ ఇస్తూ… క‌డ‌ప స్టీల్ ప‌రిశ్ర‌మ‌పై కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన కేంద్రం..

- Advertisement -

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేసిన రోజే కేంద్రం అధికారిక ప్ర‌క‌ట విడుద‌ల చేసింది. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బాబు చేస్తున్న ప‌నుల‌ను గ్ర‌హించిన కేంద్రం ఏపి ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడుతూ కడప ఉక్కు ప్యాక్టరీపై సంచలన ప్రకటన చేసింది.

కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యపడదని సెయిల్ నివేదిక చెప్పిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఉక్కు కర్మాగారంపై పూర్తి వివరాలు అందించలేదని కేంద్రం తెలిపింది. ముడి పదార్ధాల లభ్యత, గనులకు సంబంధించిన ఉన్నత స్థాయి టాస్కో పోర్స్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం గుర్తుచేసింది. దీనిపై టాస్కో పోర్స్ ఎన్నిసార్లు వివరాలు కోరినా రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పందన లేకుండా పోయిందని వెల్లడించింది.

అటవీ, పర్యావరణ అనుమతుల నివేదికను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదని, ఆ ప్రభుత్వం సహకరించనందున మెకాస్ సంస్థ తుది నివేదిక ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పేర్కొంది. ముడి ఇనుము, లభ్యత, నాణ్యత, నిల్వల వివరాలను ఏపీ ప్రభుత్వం తమకు అందించలేదని, సంబంధిత సమాచారం ఇవ్వగానే మెకాస్ సంస్థ స్టీల్ ప్లాంట్ పై తుది నివేదిక ఇస్తుందని స్పష్టం చేసింది. పెట్టుబడులకు ఉన్నమార్గాలను కూడా మెకాన్ సంస్థే సూచిస్తుందని, సర్వే ఆఫ్ ఇండియా నివేదిక, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను నిర్దేశిస్తుందని తెలిపారు.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై సాద్యా సాధ్యాలను పరిశీలిస్తుండగానే ఏపి సీఎం అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అంశం ఉన్నతస్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయమని, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కోసమే నివేదికను సిద్ధం చేస్తోందని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -