Friday, April 26, 2024
- Advertisement -

వార్త, ఆన్ లైన్ మూవీస్ పై కేంద్ర సమాచార శాఖ ప్రత్యేక నిఘా!

- Advertisement -

కరోనా ఏమంట వచ్చిందో కానీ అప్పటి నుంచి అన్ని వ్యవస్థలు అతలాకుతలం అవుతూ వచ్చాయి. ముఖ్యంగా ఎంట్రటైన్ మెంట్, మీడియా రంగానికి చెందిన వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఆన్‌లైన్ సినిమాలు, ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్, ఆన్‌లైన్ న్యూస్, కరెంట్ ఎఫైర్స్ కంటెంట్ లాంటివాటిని కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో వార్తలు అందించే పోర్టల్స్, కంటెంట్ ప్రొవైడర్స్ అందరూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి వచ్చారు.

ఈమేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.  ఇకపై నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ కేంద్ర సమాచార, ప్రసార శాఖ పరిధిలోకి వచ్చినట్టే.  ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ని నియంత్రించేందుకు స్వయంప్రతిపత్తిగల సంస్థను ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టులో గత నెలలో ఓ పిటిషన్ దాఖలైంది.

డిజిటల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు, సిరీస్‌లు ఎలాంటి క్లియరెన్స్ సర్టిఫికెట్లు లేకుండా రిలీజ్ అవుతున్నాయని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందనను సుప్రీం కోర్టు కోరింది.  ఇక నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర సమాచార, ప్రసార శాఖలోని నియమనిబంధనల్లో 22వ ఎంట్రీలో 22ఏ కింద ఆన్లైన్‌లో వచ్చే సినిమాలు, ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్‌ని, 22బీ కింద ఆన్‌లైన్‌లో వార్తలు, కరెంట్ ఎఫైర్స్ ఇచ్చే ప్లాట్‌ఫామ్స్‌ని చేర్చింది. డిజిటల్, ఆన్‌లైన్ మీడియా పేరుతో ఈ ఎంట్రీలు చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది.

హీరోయిన్ రీమాసేన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీలత ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా ?

ఈ సినీ తారల ఆత్మహత్యల మిస్టరీ..!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -