చైన్ స్నాచర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు

- Advertisement -

సికిందరాబాద్ పరిధిలో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు హుస్సేన్ ఖాన్ తో పాటు పలువురిని నార్త్ జోన్ పోలీసులు.. చాకచక్యంగా పట్టుకున్నారు.

వీరి వద్ద నుంచి ఏడు లక్షల విలువైన బంగారు ఆభరణాలు, కార్లను స్వాధీనం చేసుకున్నారు. వరుస చైన్ స్నాచింగులకు పాల్పడుతున్న హుస్సేన్ పై నల్లకుంట, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి.

ఇటీవలే జైలుకెళ్లి వచ్చిన హుస్సేన్ బైక్, కార్లు దొంగతనాలు చేస్తున్నాడు. మహిళలతో పరిచయం పెంచుకుని వారి ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లేవాడని నార్త్ జోన్ డీసీపీ తెలిపారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -