Thursday, May 2, 2024
- Advertisement -

తెలుగు త‌మ్ముళ్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు..

- Advertisement -

ప్రత్యేక హోదాపై నిరసన తెలుపుతూ ఈ రోజు తిరుపతిలోని అలిపిరి వద్ద బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్ పై టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని, టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అని, అందరూ దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు.

క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దని సూచించారు. ఏ సమయంలో ఎలా స్పందించాలో అందరూ తెలుసుకోవాలని, అధికారంలో ఉన్నప్పుడు మరింత బాధ్యతగా ఉండాలని ఆయన అన్నారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని శుక్రవారం శ్రీవారి దర్శనానికి విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమితా షాకు ప్రత్యేక హోదా సెగ తగిలింది. అమిత్ షా రాకను ముందే తెలుసుకున్న తిరుపతి వాసులు అలిపిరి వద్దకు చేరుకుని ‘అమిత్ షా గో బ్యాక్’ అంటూ నినదించారు. ఆయ‌న కాన్వాయ్‌పై రాళ్లు రువ్విన సంగ‌తి తెల‌సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -