Friday, May 10, 2024
- Advertisement -

జగన్ ని దెబ్బ తీసేందుకు చంద్రబాబు సరికొత్త రాజకీయం..!!

- Advertisement -

చంద్రబాబు తన మేధోసంపత్తికి మరొకసారి పదును పెడుతున్నారు.. రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా తీవ్రమైన ఆలోచనలు చేస్తున్నారు.రాజకీయ మేధావి గా పేరున్న చంద్రబాబు ఓటమి తో కృంగిపోకుండా పార్టీ లోపాలను వెతుకుతూ అవి సరిదిద్దుకునే పనిలో పడ్డాడు.. ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు పార్టీ కి, తనకు బెడిసికొడుతుండడంతో డైరెక్ట్ గా కాకుండా ఇన్ డైరెక్ట్ గా జగన్ ను దెబ్బతీయాలని కుల రాజకీయాలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు..

అందుకు గాను జగన్ పై అసంతృప్తిగా ఉన్న రెడ్డి సామజిక వర్గానికి గాలం వేయనున్నారు జగన్.. వాస్తవానికి జగన్ కాబినెట్ కు తన సొంత సామజిక వర్గమైన రెడ్డి నేతలకు సరైన ప్రోత్సాహం, పదవులు ఇవ్వలేదనే వాదన ఉంది.. దాంతో వారు జగన్ పై కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ అవకాశాన్ని ఆయుధంగా మలుచుకుని చంద్రబాబు వారిని తనవైపు కు లాక్కునే వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే జగన్ పై పెద్ది రెడ్డి రామ‌చంద్రరెడ్డి, మేక‌పాటి గౌతం రెడ్డి, బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వంటి ముగ్గురు న‌లుగురు నేత‌లు కొంచెం అసహనంగా ఉండగా వారిని నెమ్మదినెమ్మదిగా తన లైన్ లోకి తెచ్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట..

ద‌క్షిణ కోస్తా స‌హా సీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువగా ఉండడంతో ఆ సామజిక వర్గం వారికే అక్కడి టీడీపీ బాధ్యతలు అప్పజెప్పి ఆ ప్రాంతాన్ని, పరిస్థితి ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునేందుకు చంద్రబాబు ప్రయ‌త్నిస్తున్నారు. నెల్లూరు, అనంత‌పురం, క‌డ‌ప వంటి జిల్లాల్లో ఇప్పటికే కొంతమంది రెడ్డి సామజిక వర్గాలకు చెందిన నేతలలో టచ్ లోకి వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే రెడ్డి సామజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ కి బలమైన నాయకుడి కోసం అన్వేషణ కొనసాగుతున్న వైసీపీ ని ఢీకొట్టే ప్రత్యర్థి ఎవరు దొరకడం లేదని ఇన్ సైడ్ వర్గాల సమాచారం.. దాంతో వైసీపీ లో అసంతృప్తిగా ఉన్న రెడ్డి సామజిక వర్గానికి చెందిన నేతలను పెట్టె ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.. మరీ వీరి సహాయం తో టీడీపీ వచ్చే ఎన్నికల నాటికి ఈమేరకు బలపడుతుందో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -