Wednesday, May 8, 2024
- Advertisement -

బాబు గుట్టుమట్లు.. ఐబీచీఫ్ ను అందుకే మార్చట్లేదా?

- Advertisement -

2019 అసెంబ్లీ ఎన్నికలు బాబుకు ప్రతిష్టాత్మకం. అందుకే పకడ్బందీగా ముందుకెళ్తున్నారు. అధికారంలో ఉండంతో అన్నీ వ్యవస్థలను బాబు వాడేశారన్న విమర్శ ఉంది. అందుకే వైసీపీ ఫిర్యాదు చేయడం.. ఈసీ పోలీస్ ఉన్నతాధికారులు బదిలీ చేయడంతో తమ పరిస్థితి తలకిందులవుతున్న ఆందోళన చంద్రబాబు ప్రభుత్వంలో నెలకొంది.

వైసీపీ ఫిర్యాదు మేరకు ఏపీ ఇంటెలిజెన్స్ ఐటీ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీలను బదిలీ చేసింది. కీలకమైన వైఎస్ వివేకా నందరెడ్డి కేసును కడప ఎస్పీ డీల్ చేస్తున్నారు.. ఇక టీడీపీ ఎన్నికల గుట్టు మట్లు అన్నీ తెలిసినా.. టికెట్ల కేటాయింపులో ఐటీ సాయం తీసుకున్న చంద్రబాబు ఐబీ చీఫ్ ను మార్చడానికి మాత్రం మీనమేశాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హైకోర్టుకు కూడా వెళ్లి ఐబీ చీఫ్ బదిలీని నిలిపివేయాలని చూడడం వెనుక కారణం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

నిజానికి చంద్రబాబు సీఎం హోదాలో టికెట్ల కేటాయింపులో ముఖ్యంగా వైసీపీలో ఉద్దండులైన వారిపై ఎవరిని దింపాలనే విషయంలో ఐబీతో సర్వేలు చేయించి ఖాయం చేశాడట.. దేవినేని అవినాష్ కు ఇలాగే సర్వే చేసి టికెట్లు ఇచ్చారట.. ఇక టీడీపీ నేత బుద్దా వెంకన్న కూడా ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ఒప్పుకున్నారు.

దీంతో బాబు గుట్టుమట్లంతా తెలిసిన ఐబీ అధికారి వెంకటేశ్వరరావు పదవిలో ఉంటే బాబుకు ప్లస్ అవుతుంది. దీన్నే వైసీపీ పసిగట్టి బదిలీ చేసింది. ఇప్పుడు ఎన్నికల వేళ ఈయనే కావాలని ఎన్నికల్లో లబ్ధి పొందాలని బాబు బదిలీ నిలిపివేయడానికి చూడడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -