జగన్ సారు.. గాల్లో మేడల కట్టడం ఆపండి !

వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చిన తరువాత మూడు సంవత్సరాలలో 32 రెండు పథకాలు అమలు చేశామని సందర్భం వచ్చినప్పుడల్లా జగన్ సర్కార్ గట్టిగానే చెప్తోంది. అయితే అమలౌతున్న పథకాలు ప్రజలకు సక్రమంగా చేరుతున్నాయా అంటే సమాధానం లేని పరిస్థితి. ఇక తాము అధికారంలోకి వస్తే 4 లక్షల ఉద్యోగాలు గ్యారెంటీ అని ఎన్నికల ముందు గంటాపథంగా చెప్పుకుంటూ వచ్చిన జగన్.. వాలెంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి అవే ఉద్యోగాలని సరిపెట్టేశారు. ఈవిధంగా చెప్పుకుంటే పోతే జగన్ సర్కార్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకుంటున్న హామీలు చాలానే ఉన్నాయి. ఈ సంగతి అలా ఉంచితే.. జగన్ అధికరంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయిన మెరుగుపడిందా ? అంటే దేశంలోనే అత్యధికంగా అప్పులు తీసుకున్న రాష్ట్రంగా కేంద్ర ప్రభుత్వం చేతే అనిపించుకుంది.

ఇక పెట్టుబడుల విషయానికొస్తే కొత్తగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థ కూడా ముందుకు రావడం లేదనే మాట ఎవరు కాదనలేని వాస్తవం. మరి రాష్ట్రంలో జగన్ పరిపాలనపై ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికి.. ఈ మూడేళ్లలో ఏపీకి 17 భారీ పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 39,350 కోట్ల పెట్టుబడులు జరిగాయని జగన్ చెప్పడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. తాజాగా అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ లో ఏటిసి టైర్ల పరిశ్రమను ప్రారంభించిన సి‌ఎం జగన్ ఆవిధాంగా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఆదానీ, అంబానీ, లాంటి పారిశ్రామిక వేత్తలు ఏపీ వైపు చూస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు.

ఇక విశాఖలో మరో రెండు నెలల్లో ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటు కానుందని ఆ పరిశ్రమ ద్వారా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించనున్నాయని సి‌ఎం జగన్ వ్యాఖ్యానించారు. అయితే జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను నిరుద్యోగులు నమ్మే పరిస్థితిలో ఉన్నారా ? అంటే చెప్పడం కష్టం.. ఎందుకంటే ఇంతవరకు నిరుద్యోగులకు నోటిఫికేషన్లే విడుదల చేయలేని జగన్ సర్కార్.. ప్రైవేట్ సంస్థల ద్వారా 75 శాతం ఉద్యోగాలను కల్పిస్తుందంటే.. నమ్మడం కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని సి‌ఎం జగన్ వ్యాఖ్యలను విన్న ప్రతివాదులు గాల్లో మేడలు కట్టడం ఆపండి జగన్ సారు ” వ్యంగ్యస్త్రాలు సందిస్తున్నారు.

Also Read

మోడీ టార్గెట్ ఎవరు..?

జనసేనాని దారిలో చంద్రబాబు ?

ప్రియాంకా సౌత్ లో టేకాఫ్..టార్గెట్ తెలంగాణ ?

Related Articles

Most Populer

Recent Posts