మోడీ టార్గెట్ ఎవరు.. ఎర్రకోట సాక్షిగా చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ?

ప్రతి ఏడాది కూడా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై మన దేశ ప్రధాని జాతీయ జెండాను ఎగురవేయడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. జాతీయ జెండాను ఆవిష్కరించిన తరువాత ఎర్రకోట సాక్షిగా ప్రధాని చేసే ప్రసంగం కోసం దేశమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ప్రధాని ఏ ఏ అంశాలను తెరపైకి తీసుకొస్తాడు ? కొత్తగా ఇంకేమైనా దేశానికి ప్రకటిస్తాడా ? ఇలాంటి ప్రశ్నలతో ప్రజలు ప్రధాని ప్రసంగాన్ని వినడానికి ఆసక్తి కనబరుస్తారు. అయితే చాలా వరకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేకతకు ప్రజలకు తెలుపుతూ ఇంతవరకు దేశం సాధించిన పురగతిపై ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన తీరు గతంలో చూశాం.

అయితే ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎవరు ఊహించని విధంగా కొన్ని కీలక విషయాలను తెరపైకి తీసుకొచ్చారు. ముఖ్యంగా అవినీతి, కుటుంబ రాజకీయాలపైనా ఆయన అధికంగా ప్రసంగించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేదికపై మోడీ ఇలా పోలిటికల్ హిట్ పెంచడం ప్రస్తుత చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి వారు అవినీతి ఆరోపణల కారణంగా ఈడీ కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.. వీరిని ఉద్దేశించే మోడీ అవినీతి పరులకు వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇక మోడీ ప్రధానంగా లేవనెత్తిన మరో అంశం కుటుంబ రాజకీయాలు.. ప్రస్తుతం దేశంలో కుటుంబ రాజకీయాలు పెరిగిపోయాయని, బంధుప్రీతి కారణంగా పక్షపాత రాజకీయాలు జరుగుతాయని, అలాంటి వాటికి చోటివ్వకూడదని మోడీ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం కాంగ్రెస్, టి‌ఆర్‌ఎస్, తృణముల్ కాంగ్రెస్ వంటి పార్టీలలో కుటుంబ రాజకీయాలు ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పార్టీలను ఉద్దేశించే మోడీ ఆ వ్యాఖ్యలు చేశారని కొందరి అభిప్రాయం. అయితే ఈ మద్య బంధు ప్రీతి అనేది బీజేపీ నేతల్లో కూడా కనిపిస్తోంది.. ఇటీవల పార్లమెంట్ లో బీజేపీ నేత తేజస్వి సూర్య, ఎన్సీపీ నేత సుప్రియా సూలే మద్య కుటుంబ రాజకీయాలపై వాడివేడి గా విమర్శలు జరిగిన నేపథ్యంలో వాటికి కౌంటర్ గా మోడీ బంధుప్రీతి తగదు అనే రీతిలో ప్రసంగించాడు అనేది మరి కొందరి వాదన. అయితే మోడీ ఎర్రకోట వద్ద చేసిన ప్రసంగంలో ఏ పార్టీను కూడా ప్రత్యకంగా ప్రస్తావించకపోయినప్పటికి, ఆయన ప్రసంగం చాలా భాగం ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించేందుకే వ్యక్యాణించారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి ఎర్రకోట సాక్షిగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాల్సిన సమయంలో మోడీ పోలిటికల్ హిట్ పెంచడం కొత్త చర్చలకు చోటిచ్చింది.

జనసేనాని దారిలో చంద్రబాబు ?

ప్రియాంకా సౌత్ లో టేకాఫ్..టార్గెట్ తెలంగాణ ?

మోడీ భవిష్యత్త్ ప్రత్యర్థి.. అతనేనా ?

Related Articles

Most Populer

Recent Posts