Thursday, April 25, 2024
- Advertisement -

ప్రియాంక రాకతోనైనా.. టి-కాంగ్రెస్ లో కుమ్ములాటలకు చెక్ పడుతుందా !

- Advertisement -

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరుస షాక్ లతో సమమతమౌతోంది. టీపీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డి అధిష్టించినది మొదలుకొని కాంగ్రెస్ లోని సీనియర్ నేతలలో ముసలం ఏర్పడింది. రేవంత్ నాయకత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఆయా సందర్భాలలో అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంచితే ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా వరుసగా గుడ్ బై చెప్తూ ఉండడం ఆ పార్టీని మరింత దెబ్బ తీస్తోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పడంతో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దాంతో మునుగోడు ఉపఎన్నికలకు తెరలేచింది.

కాంగ్రెస్ మరో సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఇంకా మరింత మంది సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ ను వీడే ఆలోచనలో ఉన్నారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం ఆ పార్టీకి మరింతా తలనొప్పిగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై వరుసగా విమర్శలు చేస్తూ కాంగ్రెస్ కలపాలకు దూరంగా ఉంటున్నారు. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ కు మరింత నష్టం చేకూర్చే అవకాశం కూడా ఉంది.

ఈ నేపథ్యంలో టి- కాంగ్రెస్ లో జరుగుతున్నా ఈ అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దెందుకు కాంగ్రెస్ అధిష్టానం ఒక్క అడుగు ముందుకు వేసింది. ఏకంగా ప్రియాంకా గాంధీని తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ గా నియమించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రియాంక కేవలం తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ గానే ఉంటారా ? లేదా మొత్తం సౌత్ రాష్ట్రాలలోనే కాంగ్రెస్ కు అధ్యక్షత వహిస్తారా ? అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ప్రియాంకా ఫోకస్ కేవలం తెలంగాణపైనే ఉండే అవకాశం ఉంది. మరి ప్రియాంక రాకతోనైనా తెలంగాణ కాంగ్రెస్ లోని నేతల కుమ్ములాటలు సద్దుమనిగి రాబోయే ఎన్నికలకు సంస్థాగతంగా ముందుకు వెళ్తారో లేదో చూడాలి.

Also Read

మోడీని దువ్వుతున్న బాబు..!

సర్వేల తీర్పు సమంజసమేనా ?

కే‌సి‌ఆర్ ను తక్కువగా అంచనా వేయొద్దు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -