Wednesday, April 24, 2024
- Advertisement -

శశికళ జైలు శిక్షలో కుదింపు..!

- Advertisement -

అక్రమార్జన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ.. తనను ముందస్తుగా విడుదల చేయాలని అభ్యర్థించినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే ప్రత్యేక కోర్టుకు రూ. 10 కోట్ల జరిమానా చెల్లించారు శశికళ. వచ్చే ఏడాది జనవరి 27న ఆమె విడుదలయ్యే అవకాశం ఉందని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు. అయితే అంతకుముందే తనను విడుదల చేయాలని కోరినట్లు శశికళ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

శశికళ అభ్యర్థనను జైలు శాఖ వర్గాలు ఉన్నతాధికారులకు పంపించినట్లు వెల్లడించాయి. ఈ విన్నపంపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశాయి.జైలు నిబంధనల ప్రకారం కారాగారంలో సత్ప్రవర్తనతో మెలిగితే.. శిక్షలో ప్రతి నెల మూడు రోజుల మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రకారం శశికళకు విధించిన శిక్షలో 135 రోజులు తగ్గే అవకాశం ఉంటుంది.

ఈ కేసులో శశికళతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కూడా ఉన్నారు. ఇందులో జయలలితకు రూ.100 కోట్లు, శశికళ సహా మరో ఇద్దరికి రూ.10 కోట్ల చొప్పున జరిమానా విధిస్తూ 2014 సెప్టెంబర్​లో ట్రయల్​ కోర్టు తీర్పునిచ్చింది. జయలలిత మరణంతో ఆమెపై ఉన్న అప్పీలు రద్దైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -