కాంగ్రెస్ సవ్యసాచి అహ్మద్​ పటేల్ కన్నుమూత..!

- Advertisement -

కాంగ్రెస్​ సీనియర్​ నేత, గుజరాత్​కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్​ (71).. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్​ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.

71 ఏళ్ల పటేల్​ తాను కొవిడ్​ బారిన పడినట్లు అక్టోబర్​ 1న ట్విటర్​ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్​ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.

- Advertisement -

అహ్మద్ పటేల్​జీ మరణించారని తెలిసి బాధపడ్డా. ప్రజా జీవితంలో ఆయన ఎన్నో ఏళ్లు గడిపారు. సమాజానికి సేవ చేశారు. ఆయన చురుకైన వ్యక్తి. కాంగ్రెస్​ను బలోపేతం చేయటంలో ఆయన పాత్ర మరువలేనిది. అహ్మద్ కుమారుడు పైజల్​తో మాట్లాడాను. అహ్మద్ జీ ఆత్మకు శాంతి చేకూరాలి అని మోదీ సోషల్ మీడియా వేదికగా అన్నారు.

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

గుండె కోసం ఈ పది సూపర్ ఫుడ్స్

త్వరగా భోజనం చేయటం లేదా? అయితే ఇది చదవండి!

మన స్టార్ హీరోయిన్స్ అసలు పేర్లు ఏంటో తెలుసా ?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...