Friday, May 3, 2024
- Advertisement -

మళ్లీ తెలంగాణ లో పెరుగుతున్న కేసులు.. చాప కింద నీరు లా విస్తరణ..!

- Advertisement -

తెలంగాణ లో కరోనా తగ్గినట్లే తగ్గి… మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మరో 157 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 37 మంది మహమ్మారి బారిన పడ్డారు. వైరస్‌కు ఇద్దరు బలయ్యారు. కొత్తగా 170 మంది బాధితులు కొవిడ్​ను జయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,015 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం 624 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ వైరస్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది.

భారత్​లో కరోనా తీవ్రత పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 24,492 కొత్త కేసులు వెలుగుచూశాయి. 131 మంది వైరస్​కు బలయ్యారు.సోమవారం దేశవ్యాప్తంగా 8 లక్షల 73 వేల 350 కొవిడ్ టెస్టులు జరిపినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. ఇప్పటివరకు 22 కోట్ల 82 లక్షల 80 వేల 763 మందికి పరీక్షలు జరిపినట్లు స్పష్టం చేసింది.దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల29 లక్షలకుపైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.

కరోనా ఉందని తెలిసి షూటింగ్ కి హాజరైన హీరోయిన్.. కేసు నమోదు!

తెదేపా, జనసేనపై నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు!

‘జాతిరత్నాలు’ బ్యూటీకి బంపర్ ఆఫర్?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -