Thursday, April 25, 2024
- Advertisement -

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేతగా న్యూజిలాండ్

- Advertisement -

సౌతాంప్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ విజయకేతనం ఎగురవేసింది. భారత్ నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్‌ను రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కివీస్ ఛేదించింది. రెండేళ్లపాటు సాగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అద్భుత విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు ఫైనల్ మెట్టు వద్ద బోల్తాపడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీ సేన న్యూజిలాండ్‌కు టైటిల్ అప్పగించి రన్నరప్‌గా సరిపెట్టుకుంది.

దీనికి తోడు ఆట మొదలైనప్పటి నుంచి వరుణుడు చేస్తున్న గందరగోళం చూస్తూనే ఉన్నాం. పరాజయాన్ని తప్పిస్తాడని భావించిన టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ (52), రాస్ టేలర్ (47) తుది కంటా నిలబడి తమ జట్టును విజయ తీరాలకు చేర్చారు. కాగా రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు.

కోహ్లి 29 బంతుల్లో 13 పరుగులు మాత్రమే చేసి జెమీసన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే పుజారా కూడా ఔటయ్యాడు. 80 బంతుల్లో 15 పరుగులు చేసిన పుజారాను కూడా జెమీసనే ఔట్ చేశాడు. తొలిసారి నిర్వహించిన ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ టైటిల్‌ను విలియమ్సన్ సేన ఎగురవేసుకుని పోయి టీమిండియాకు నిరాశను మిగిల్చింది.

ఇంగ్లీష్​లో డబ్​ అయిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

బెల్లంకొండ గణేశ్​ హీరోగా మరో సినిమా..!

ఆనందయ్య అసంతృప్తి.. కారణం ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -