Monday, April 29, 2024
- Advertisement -

మాస్క్ తో కరోనాను వైరస్ నివరించవచ్చా ?

- Advertisement -

ఇప్పుడంతా కరోనా బిజినేస్ అయిపోయింది. ఇదేంటి కరోనా వైరస్ కదా అనుకుంటున్నారా ? అయితే విషయంలోకి వెళ్లాల్సిందే. చైనా నుంచి ఇతర దేశాలకు ఈ కరోనా వైరస్ వ్యాపించింది. మొత్తానికి ఇండియాకు వచ్చింది. తాజాగా తెలంగాణలో సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వైరస్‌ సోకిందని నిర్దారణ కావడంతో రాష్ట్రా వ్యాప్తంగా గందరగోలం ఏర్పడింది.

ఇప్పటికే కరోనా వైరస్ రాకుండా ఉండేందుకు అధికారు తగిన జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ వచ్చిన వ్యక్తి ఇతర దేశాలు తిరిగి రావడం వల్ల వచ్చిందని అధికారులు అంటున్నారు. అయితే మరో విషయం ఏంటంటే తెలంగాణలో నివసిస్తున్న ఏ వ్యక్తికి ఈ కరోనా వైరస్ రాలేదని అధికారులు చెప్పారు. ఇక సికింద్రాబాద్‌లోని మహేంద్ర హిల్స్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా వచ్చిందని.. ఆ ఏరియాలో ఉండే వ్యక్తులు ఎవరు బయటకు రావడం లేదు. అంతేకాకుండా హైటెక్ సిటీలో ఓ కంపెనీ వర్క్ ఇంట్లోనే చేసుకునేలా పర్మిషన్ ఇచ్చింది. కొన్ని స్కూల్స్ కి సెలవలు ప్రకటించారు.

అయితే మరికొన్ని స్కూల్స్ కానీ.. ఆఫీస్స్ లో కానీ మరె ఇతర ప్లేస్ లోకి వెళ్లాలన్న మాస్కులు ధరించి రావాల్సిందే అని ఆర్డర్ చేస్తున్నారు. ఇదే ఛాన్స్ గా వ్యాపారులు డబ్బును ధన్నుకుంటున్నారు. రెండు లేయర్లతో ఉన్న మాస్కు మాములు ధర రూ. 2 నుంచి 3 రూపాయల మధ్య ఉంటుంది. కానీ ఇప్పుడు మెడికల్‌ దుకాణాదారులు ఒక్కోదానికి రూ.20 నుంచి 25 వరకు వసూలు చేస్తున్నారు. రూ.30-40 విలువ చేసే ఎన్‌95 మాస్కును రూ.300 లకు అమ్ముతూ ప్రజలను దోచేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద హాప్సిటల్స్ లో వీటికి గిరాకీ పెరిగింది. ప్రభుత్వం మాత్రం మాస్కులకు ఎలాంటి కొరుతా లేదని చెబుతున్నప్పటికి వ్యాపారులు మాత్రం ఈ విధంగా డబ్బు దోచుకుంటున్నారు.

వైరస్ రాకుండా ఉండాలంటే ఈ మాస్కులను ధరించాలనే డిమాండ్ ఉంది కాబట్టి రేటు ఎంతైన ప్రజలు కొంటున్నారు. కానీ సాధరణ ప్రజలు మాత్రం ఇంత చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారులు కూడా ఉన్న స్టాక్ ను దాచి.. నెమ్మదిగా ఎక్కువ రేటుకు మాత్రమే అమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధిక డబ్బు డిమాండ్ చేయొచ్చు కాబట్టి. గతంలో 100 మాస్కులు ఉన్న ఒక ప్యాకెట్‌ను రూ.160కి తీసుకునేవారు. కానీ ఇప్పుడు 100 మాస్కులు రూ.1600 పైనే డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

నిజానికి ఎవరికైన దగ్గు.. జల్బు ఉన్నవారు మాత్రమే ఈ మాస్కులు ధరించాలి. అది కూడా రూ. 2 మాస్క్ మాత్రమే. కానీ ముద్దు జాగ్రత్త కోసం అందరు వాడుతున్నారు. ఇక ఎన్‌95 మాస్కులను ప్రజలు వాడాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. ఇది ఎక్కువ రేటు. ఇది కేవలం కరోనా సోకిన వారు. హాస్పిటల్స్ లో ఉన్న వైద్యులు.. సిబ్బంది మాత్రమే ధరిస్తారని చెబుతున్నారు. ఈ విషయం తెలియని ప్రజలు ఒక్కో మాస్కుకు రూ.300 చెల్లించి అవే వాడుతున్నారు. ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్య మీ దగ్గరకు రాదు.

బయటకు వెళ్లినప్పుడు ఈ మాస్కులు కూడా ధరించాల్సిన అవసరం లేదు. హ్యాండ్ కర్చీఫ్ లేదా, స్కార్ఫ్ లాంటివి నోరు, ముక్కుకు అడ్డు పెట్టుకున్నా సరిపోతుంది. అది కూడా లేకుంటే టిష్యూ పేపర్ ని కూడా వాడవచ్చు. అయితే వీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుంది. చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వైరస్ మన దరి చేరదు. అందువల్ల ఆహారం తీసుకునే ముందు, ఆరుబయటకి వెళ్లొచ్చిన తర్వాత, ఏవైనా వస్తువును ముట్టుకున్న తర్వాత సబ్బుతో చేతులను పరిశుభ్రం చేసుకోవాలి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. కరోనా వైరస్ ప్రధాన లక్షణాలు.

ఇవి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. గర్భిణులు, పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే.. నిజానికి మనుషులను చంపే శక్తి కరోనా వైరస్‌కు లేదు. అప్పటికే వారికున్న రుగ్మతల వల్ల మృతి చెందవచ్చు అని. ఉదాహారణకు 60 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకితే.. అప్పటికే ఆ వ్యక్తికి అతిసార లాంటి వ్యాధి ఉంటే అది తగ్గదు. దాంతో అతను మరణించే ఛాన్స్ ఉంది. ఎవరికైన ఆరోగ్యపరమైన సమస్యలు లేకుంటే ఈ వైరస్ తో మరణం ఉండదు.

ముక్కు, నోరు ద్వారా మాత్రమే ఇది మనిషిలోపడికి వెళ్తోంది. గాలి ద్వారా ఇది వ్యాపించదు. ఎదుటి వ్యక్తి తుప్పర్లు ద్వారా వ్యాప్తిస్తోంది. కాబట్టి కరోనా వైరస్ సోకితే వెంటనే చనిపోరు. 14 రోజుల్లోపు ఎప్పుడైనా లక్షణాలు బయటపడవచ్చు. కరోనా అంటుకున్న వస్తువును ఎవరూ తాకకపోతే.. 3, 4 రోజుల్లో ఆ వైరస్ చనిపోతుంది. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం ద్వారా వైరస్ మన దరి చేరకుండా రక్షించుకోవచ్చు.

సో మాస్కుల మాత్రమే కరోనా వైరస్ నివరించవచ్చా అనేది మనసులో నుంచి తీసేయండి. మీరు పరిశుభ్రంగా కూడా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇతర దేశాల్లో ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు మాస్కుల పేరుతో కోట్లలో బిజినేస్ జరిగింది. ఇక్కడ కూడా డబ్బు దోచుకోవాలనే పద్దతిలో ఇలా చేస్తున్నారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -