Friday, May 24, 2024
- Advertisement -

” కెసిఆర్ ఆపు నీ మోడీ భజన “

- Advertisement -
Cpi Leader  chada venkat reddy fire on Telangana CM KCR

సామాన్య ప్రజలు ఒకపక్క కేవలం రెండు వేల రూపాయల నోటు కోసం atm లూ బ్యాంకుల దగ్గర భారీ క్యూలు కడుతూ ఉంటే పెద్ద ల దగ్గర కొత్త కరన్సీ లో కోటానుకోట్లు దొరకడం సిగ్గుచేటు అంటున్నారు  సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి.

దేశంలోని 130 కోట్ల మంది ప్రజలను ఇబ్బందులకు గురి చేసూ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ఎలా స్వాగతిస్తారని చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు. దేశంలోని కొంత మంది పెట్టుబడిదారుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తోందని చాడ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు వెనుక పెట్టుబడిదారుల కుట్ర దాగి ఉందని ఆయన విమర్శించారు.  

పెద్ద నోట్ల రద్దుతో కోనుగోలు శక్తి తగ్గిపోయిందని దీనితో అన్ని రంగాలపైన ప్రభావం పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న తరహ పరిశ్రమలు – వ్యాపారాలు కుదేలు అయ్యాయని అనేక చిన్నతరహ పరిశ్రమలు మూత పడి రోజు వారి కూలీ దొరక్క చాలా మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 23 వరకు హైదరాబాద్లోని మకుం భవన్లో సిపిఐ జాతీయ సమావేశాలు జరగనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో పెద్ద నోట్ల రద్దుతో పాటు ఐదు రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికల పై చర్చించనున్నట్లు చాడ వెంకటరెడ్డి తెలిపారు.రాష్ట్రాన్ని నగదు రహిత రాష్ట్రాంగా తీర్చి దిద్దుతామని కేసీఆర్ చెప్పడం హస్యాస్పదమని చాడ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీకి తొత్తుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అందుకే మోడీ నిర్ణయానికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో పెద్ద నోట్ల రద్దును స్వాగతించడం కంటే అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకొంటున్నవిషయాలను చర్చించి కేంద్ర ప్రభుత్వానికి సరైన నివేదికను అందజేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -