Thursday, May 9, 2024
- Advertisement -

నానాటికి క్షీణిస్తున్న ఆరోగ్యం

- Advertisement -

కాపుల రిజర్వేషన్లు, తుని ఘటనలో అక్రమ అరెస్టులకు నిరసనగా కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష ఆసుపత్రిలో ఇంకా కొనసాగుతోంది. కిర్లంపూడిలో తన స్వగ్రహంలో ముద్రగడ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిని భగ్నం చేస్తూ పోలీసులు ఆయనను రాజమండ్రి ఆసుపత్రితో చేర్పించారు. అక్కడ ముద్రగడ తన దీక్షను కొనసాగిస్తున్నారు.

దీంతో ఆయన ఆరోగ్యం నానాటికి క్షీణిస్తోంది. డాక్టర్లు, కాపు నాయకులు, ప్రతిపక్షాలకు చెందిన వారు ఎంత చెప్పినా  ముద్రగడ తన దీక్షను విరమించడం లేదు. ఆయన దీక్ష ఇలాగే కొనసాగితే పరిస్ధితులు చేయి దాటతాయని ప్రభుత్వ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం దీనిపై ఇంకా పెదవి విప్పలేదు. మరోవైపు రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

చంద్రబాబు ఈ విషయాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకున్నారో తెలియడం లేదని, ఆయన పట్టుదల వీడితే గంటలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఉండవల్లి అన్నారు. ఇంట్లో దీక్ష చేస్తున్న ముద్రగడను తీసుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారని, ఇక్కడ పోలీసులు ఎవరిని లోపలికి అనుమతించడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాసుపత్రి అంటే సామాన్యుల ఆసుపత్రి. వారిని ఇక్కడికి రావద్దు అంటే ఎలా అని ఉండవల్లి ప్రశ్నించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -