Thursday, May 9, 2024
- Advertisement -

ప్ర‌భుత్వ జీవో టిష్యూ కాగితంతో స‌మానం…ఉండ‌వ‌ల్లి

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో సీబీఐ ఎలాంటి దాడులు చేయాలన్నా ప్రభుత్వ అనుమతి కచ్చితంగా తీసుకోవాలంటూ జారీ చేసిన జీవోపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఘాటుగా స్పందించారు. సీబీఐని రావడానికి వీల్లేదనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న సంస్థల్లో జరిగే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలపై నేరుగా సీబీఐ దాడులు చేయోచ్చన్నారు. దీనికోసం ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.

చంద్రబాబు తన 15 ఏళ్ల పాలనలో ఎప్పుడూ కూడా సీబీఐ ఎంక్వైరీ కోరలేదని గుర్తు చేశారు. ఏ విషయంపై నైనా కోర్టు ఆదిశిస్తే సీబీఐ ఎంక్వైరీ చేయవచ్చునని తెలిపారు. ప్రభుత్వం సీబీఐని రావడానికి వీల్లేదని చెబితే చెల్లదన్నారు. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన జీవో చిత్తు కాగితంతో స‌మాన‌మ‌ని కొట్టి పారేశారు.

ఏపీ ప్రభుత్వం సీబీఐని రావడానికి వీల్లేదని చెప్పడం కుదరదన్నారు. యూపీలో కళ్యాణ్ సింగ్ సర్కార్, పప్పూ యాదవ్ కేసులో ఇదే జరిగిందని గుర్తు చేశారు ఉండవల్లి. సీబీఐను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. దయచేసి ఇప్పటికైనా ఈ ఆలోచనను మార్చుకోవాలని స‌ల‌హా ఇచ్చారు ఉండవల్లి.

మీ పార్టీ నేతలపై ఐటీ దాడులు జరిగితే అది కేంద్రం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఐటీ రైడ్లు చేయడం ద్వారా తనను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని ఓ సీఎం చెప్పడం దారుణమన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -