Thursday, May 2, 2024
- Advertisement -

ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో మరో బాహుబలి చూపిస్తున్నారు

- Advertisement -

ఏపీకి ప్రాణ‌వాయువులాంటి ప్రాజెక్ట్ పోల‌వ‌రం.రాష్ట్ర‌విభ‌జ‌న త‌ర్వాత ఈప్ర‌జెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించింది. అయితే పోల‌వాన్ని కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే పూర్తి చేయాల్సి ఉంటుంది.కాని రాష్ట్ర ప్ర‌భుత్వం మేమే పూర్తి చేస్తామంటు త‌న చేతుల్లోకి తీసుకుంది.కాని 2018 నాటికి ఈ ప్ర‌జెక్టును పూర్తి చేస్తామ‌ని బాబు ప‌దే ప‌దే ప్ర‌క‌టిస్తున్నారు.కాని నిజానికి ఇది అప్ప‌టికి పూర్త‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డంలేదు.

తాజాగా బిజెపి మహిళా నాయకురాలు పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోలవరం ప్రాజెక్టు అంశంపై బాంబు పేల్చారు. 2018లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుంటే కేంద్రం గ్రాంట్‌గా ఇచ్చే నిధులు అప్పుగా మారుతుందని చెప్పారు.పోలవరంపై కేంద్రం గడువు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే అంశంపై కేంద్రం గడువు విధించిందని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పారు. ఆ లోగా పూర్తి కాకుండా కేంద్రం ఇచ్చిన నిధులు అప్పుగా మారుతుందని ఆయన చెప్పారు.

ఏపీ పైనే భారం 2018 మార్చిని కేంద్రం ప్రాజెక్టు పూర్తికి గడువుగా పెట్టిందని దగ్గుబాటి చెప్పారు. కేంద్రం ప్రాజెక్టుకు గ్రాంట్లు ఇస్తుంది కానీ, ఆ లోగా పూర్తి కాకుంటే గ్రాంట్ అప్పుగా మారి, ఆ డబ్బు భారం అంతా ఏపీపై పడుతుందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో మరో బాహుబలి చూపిస్తున్నారని దగ్గుబాటి ఎద్దేవా చేశారు. తన పోలవరం ప్రాజెక్టు పర్యటనలో ఎలాంటి రాజకీయం లేదని చెప్పారు.

మ‌రోవైపు ఉండవల్లి కూడా సంచలన వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఎప్పుడు పూర్తి చేస్తారో అర్థం కావడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. నెలకు రూ.10 వేల కోట్ల అంచనాలు పెంచుతున్నారన్నారు. కమీషన్ల కోసమే కేంద్రం నుంచి ప్రాజెక్టు పనులు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. మ‌రి ప్ర‌భుత్వం ఈప్ర‌జెక్టును పూర్తి చేస్తుందా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -