ఆస్పత్రికి దీపికా పదుకొనె

బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అస్వస్థతకు గురయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. బాలీవుడ్, హాలీవుడ్‌, టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న దీపికా ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కేలో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ్‌ అశ్విన్ దర్శకుడు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ప్రత్యేక సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో పాల్గొంటున్న దీపికాకు హఠాత్తుగా హార్ట్ బీట్ పెరగడంతో వెంటనే కామినేని ఆస్పత్రికి వెళ్లారట. ఆమెను వైద్యులు పరీక్షించినట్టు సమాచారం. అయితే సాధారణ పరీక్షల్లో భాగంగానే ఆమె ఆస్పత్రికి వెళ్లారంటున్నారు.

ప్ర‌స్తుతం ప్రాజెక్టు కే షూటింగ్‌లో పాల్గొంటుంన్నారని తెలుస్తోంది. మరోవైపు వరుస చిత్రాలతో దీపికా పదుకొనె బిజీబిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ కే తో పాటు సర్కస్ మూవీ చేస్తోంది. ఓ హాలీవుడ్ మూవీలోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం.

Also Read

1.ఈ పండ్లు, కూరగాయలు మధుమేహుల పాలిట వరాలు…

2.మధ్యాహ్నం పడుకుంటున్నారా ? అయితే ఇది తప్పక చదవండి…

3.విక్రమ్ డైరెక్టర్ తో రామ్ చరణ్

Related Articles

Most Populer

Recent Posts