Friday, May 10, 2024
- Advertisement -

టీడీపీకీ షాక్‌… జ‌గ‌న్ ల‌క్షకోట్ల వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై తాజాగా జ‌న‌సేన విశాఖ‌ప‌ట్నం ఎంపీ అభ్య‌ర్ధి, సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఇన్నాల్లు జ‌గ‌న్ ల‌క్ష‌కోట్లు తిన్నాడ‌ని బాబు అండ్ కో చేస్తున్న ఆరోప‌ణ‌ల‌కు చెక్ ప‌డింది. జ‌గ‌న్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . 2014 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ల‌చ్చ కోట్లు తిన్నాడ‌ని బాబు, టీడీపీ పార్టీ ల‌బ్దిపొందిన సంగ‌తి తెలిసిందే.

వైఎస్ జగన్ లక్ష కోట్లు దోచుకున్నారనేది అవాస్త‌వం అన్నారు.ఓ టీవీ చానల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, రాజకీయ ప్రచారం కోసం జగన్ పై ఆరోపణలు చేసినట్టుగా ఉందని, తమకు లభించిన ఆధారాల మేరకు అవినీతి ఆరోపణలు నాకు గుర్తున్నంతవరకు రూ. 1,500 కోట్ల వరకూ ఉన్నాయని, తాము దాన్నే చార్జ్ షీట్ లో పొందుపరిచామని అన్నారు. ఎవరో జగన్ పై ఆరోపణలు చేస్తూ, రాజకీయంగా వాడుకుని ఉంటే తానేమీ చేయలేనని అన్నారు.

జగన్ కేసులను కొందరు నేత‌లు రాజకీయంగా వాడుకుని ఉంటే అందుకు తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.జ‌గ‌న్ అనేక‌సార్లు నిజంగా అంత దోచుకుంటే మొత్తం తీసుకుని దానిలో ప‌ది శాతం ఇవ్వ‌మ‌ని స‌వాల్ చేసినా, జ‌నాల మైండ్‌లో టీడీపీ నేత‌లు చేసిన ఆరోఫ‌ణ‌లు, వాటికి మాసాలా పై టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసిన వార్త‌లు ప్ర‌జ‌ల్లో బలంగా వెళ్ళాయి. జ‌గ‌న్ ల‌క్ష కోట్లు దోచుకున్నార‌నె న‌మ్ముతున్నారు.

జ‌గ‌న్ కేసులు విచారించిన మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణే చెప్ప‌డంతో టీడీపీ నేతలు జ‌గ‌న్ పై ఏ స్థాయిలో కుట్ర‌ప‌న్ని విష‌ప్రాచారం చేశారో అర్ధ‌మ‌వుతోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మాత్రం ఊహించ‌ని షాకే అని రాకీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. జ‌గ‌న్ ల‌చ్చ కోట్ల‌పై ప‌చ్చ నేత‌ల నోళ్ల‌కు తాళం వేసినట్లే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -