Wednesday, April 24, 2024
- Advertisement -

ఐదు గంటలపాటు చర్చ..19 న మరోసారి భేటి..!

- Advertisement -

కొత్త సాగు చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య 9వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు మరోసారి స్పష్టం చేశారు. అయితే అందుకు నిరాకరించిన ప్రభుత్వం.. రైతులు పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరింది. చట్టాల్లో సవరణలకు సిద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి జనవరి 19న సమావేశం కావాలని ఇరు పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, పంజాబ్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి సోమ్‌ ప్రకాశ్ ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో రైతులతో చర్చలు జరిపారు. 40 రైతు సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. భోజన విరామంతో కలిపి ఐదు గంటలపాటు చర్చ కొనసాగింది. తమ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కారం కావాలని ఇరు పక్షాలు భావిస్తున్నట్లు రైతు సంఘాలు చెప్పాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -