Monday, May 6, 2024
- Advertisement -

ఈ శివరాత్రికి ఏమైంది.. రాజన్న కి కుడా నష్టమే..!

- Advertisement -

దక్షిణకాశిగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన మహాశివరాత్రి వేడుకల ఆదాయం గతంతో పోలిస్తే కొంత మేర తగ్గింది. మూడు రోజుల పాటు జాతరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయంలోని వివిధ విభాగాల ద్వారా ఆదాయం సమకూరింది.

ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన వేడుకల్లో దాదాపు మూడు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈనెల 10, 11 తేదీలలో కోడె మొక్కులు, ఆర్జిత సేవలు, ప్రసాదాలు, కేశఖండనం, శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం, బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయం, భీమేశ్వరాలయం, నగరేశ్వరాలయం, గదులు, ఇతర విభాగాల ద్వారా రూ.85లక్షల 55వేల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

గతేడాది రూ.88లక్షల 59 సమకూరింది.గతేడాది మహాశివరాత్రి వేడుకలతో పోల్చితే రూ. 3 లక్షలపైగా ఆదాయం తగ్గినట్లు తేలినా ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉంది. ఈసారి వేడుకలకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనకు రూ.1.80 కోట్లు ఖర్చు చేశారు.

ఆ నలుగురిపై పిడుగు పడింది.. కానీ..

ఎన్టీఆర్ ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రోమో అదిరిపోయింది!

బాలీవుడ్ నటుడు ఆశిష్ విద్యార్ధి ‌కి కరోనా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -