Saturday, April 20, 2024
- Advertisement -

ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితం..!

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభమైంది. రహమత్‌నగర్‌లో మంత్రి కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఇంటింటికి జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని, మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ రామ్మోహన్, సీఎస్ సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.

ఒక్కో కుటుంబానికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ మేరకు పథకం ప్రారంభించారు. బస్తీల్లో నల్లాలకు మీటర్లు లేకున్నా ఉచితంగా తాగునీటి సరఫరా చేయనున్నారు. అపార్టుమెంట్లలో నీటిమీటర్లు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. 20వేల లీటర్లు దాటితే పాత ఛార్జీలతో నీటిబిల్లుల వసూలు చేస్తారు.

ఈ పథకంతో జంట నగరాల్లో మొత్తం 10.08 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఉచిత తాగునీటి పథకం మార్గదర్శకాలు విడుదల చేశారు. జ‌న‌వ‌రిలో జారీచేసే డిసెంబ‌రు బిల్లు నుంచే పథ‌కం వర్తించనుంది. మురికివాడలు, బస్తీలలో నల్లా కనెక్షన్లకు ఉచితంగా తాగునీరు పంపిణీ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -