Friday, May 3, 2024
- Advertisement -

అభివృద్దిలో కాదు స్మగ్లింగ్ లో నెంబర్ ఒన్ !

- Advertisement -

ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అభివృద్ది పథంలో దూసుకుపోతోందని వైసీపీ నేతలు తరచూ చెబుతూనే ఉంటారు. అయితే అలాంటిదేమీ లేదేని జగన్ వచ్చిన తరువాత రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, గతంలో ఏ ప్రభుత్వం చేయానంత అప్పు భారం జగన్ సర్కార్ రాష్ట్రంపై మోపిందని ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తుంటారు. ఇదిలా ఉంచితే వైసీపీ నేతలు చెబుతున్నా దాని ప్రకారం రాష్ట్రం అభివృద్ది పథంలో ఉందో లేదో తెలియదు గాని. తాజాగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో మాత్రం నెంబర్ ఒన్ స్మగ్లింగ్ రాష్ట్రంగా ఏపీ నిలిచింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ( డి ఆర్ ఐ ) నుంచి వెలువడిన నివేదికలో 2021-22 గాను డ్రగ్స్ ను అత్యధిక స్థాయిలో ఏపీలోనే స్వాధీనం చేసుకున్నట్లు ” స్మగ్లింగ్ ఇన్ ఇండియా ” పేరుతో కేంద్ర మంత్రి నిర్మలసీత రామన్ ఒక నివేదికను విడుదల చేశారు. .

ఏపీలో అత్యధికంగా 18,267.87 కిలోల డ్రగ్స్ స్వాదినం చేసుకున్నట్లు ఆ నివేదికలో తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాతి స్థానంలో త్రిపుర ( 10,104.99 కిలోలు ), అసోం (3,633.08 కిలోలు ), తెలంగాణ ( 1,012.04 కిలోలు ) రాష్ట్రాలు నిలిచాయి. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో హీరాయిన్, బ్రౌన్ షుగర్, ఓపియం, మార్ఫిన్, గంజాయ్, వంటి రకాలు ఉన్నట్లు డి ఆర్ ఐ నివేధిక వెల్లడించింది. ఇక డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్ ఒన్ స్థానంలో నిలవడం పై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష టీడీపీ విమర్శల దాడి చేస్తోంది. డ్రగ్స్ సరఫరా లో ఏపీ నెంబర్ ఒన్ గా నిలవడం నిజంగా సిగ్గుచేటని.. కేంద్రం ఇచ్చిన ఈ నివేదికతో జగన్ తల ఎక్కడపెట్టుకుంటారని టీడీపీ నేత బోండా ఉమా ఎద్దేవా చేశారు. ఈ నివేధిక పై సి‌ఎం జగన్ ఖచ్చితంగా స్పందించాలని, ఎంకెవరు స్పందించిన ఉరుకునేది లేదని బోండా వ్యాఖ్యానించారు. ఏపీని గంజాయ్ డెన్ గా మార్చిన ఘనత వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డిదే నంటూ ఆయన విమర్శించారు. మొత్తానికి డ్రగ్స్ స్మగ్లింగ్ లో ఏపీ నెంబర్ ఒన్ గా నిలవడం నిజంగా వైసీపీ ప్రభుత్వానికి పరువు పోయే విషయం. మరి ఈ నివేధిక పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

రైతులు నిజంగానే కాలర్ ఎగరేస్తున్నారా.. కే‌సి‌ఆర్ సార్ !

మీ ఫోన్ బ్లూటూత్ తో.. పెను ముప్పే !

ఉగాదికి ఫ్యామిలీ డాక్టర్స్.. రెడీ అంటున్న సి‌ఎం జగన్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -