Wednesday, May 1, 2024
- Advertisement -

చైనాలో పేలిన గ్యాస్​ పైప్​ లైన్.. 12 మంది మృతి

- Advertisement -

చైనాలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచాన్ని భయం గుప్పిట్లో నింపిన కరోనా వైరస్ చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చింది. తాజాగా చైనాలో హ్యూబెయ్ ప్రావిన్స్ లోని షియాన్ సిటీలోని ఓ నివాస సముదాయం వద్ద గ్యాస్ పైప్ లైన్ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయారు. 144 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల ప్రజలు భయంతో పారిపోయారు. గాయపడిన వారిలో 37 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. అయితే ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.

అయితే 2013లో ఈశాన్య ప్రాంతంలోని ఖింగ్డావోలో భూగర్భంలోని పైప్ లైన్ లు లీకై పెద్ద పేలుడు సంభవించడంతో 55 మంది చనిపోయారు. అంతే కాదు 2015లో ఓ రసాయన గోదాములో జరిగిన ప్రమాదంలో 173 మంది మరణించారు. అందులో ఎక్కువగా అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులే ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -