Wednesday, May 8, 2024
- Advertisement -

రాష్ట్ర కొత్త డీజీపీగా గౌతమ్ సవాంగ్ నియామకం..

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌క‌ముందే పాల‌న‌లో త‌న దైన మార్కును చూపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంట్ ప్ర‌క్షాల‌ను శ్రీకారం చుట్టారు. గ‌తంలో డీజీపీగా ప‌నిచేసిన ఠాకూర్ అప్ప‌టి ప్ర‌భుత్వానికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించారె ఆరోన‌లు అనేకం ఉన్నాయి. ఈసారి అలాంటి ఆరోప‌న‌లు లేకుండా జ‌గ‌న్ జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

ప‌రిపాల‌న‌లో త‌మ మార్కును చూపించేందుకు కీల‌క స్థానాల్లో నిజీయితీ గ‌ల అధికారులు వ‌స్తున్నారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ స్థానంలో 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు. జగన్ ఏరికోరి సవాంగ్ ను పోలీస్ బాస్ గా తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ సవాంగ్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

సవాంగ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన పోలీస్ కెరీర్ ప్రారంభించారు. ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001 నుంచి 2003 మధ్య వరంగల్ రేంజ్ డీఐజీగానూ వ్యవహరించారు. 2003 నుంచి 2005 వరకు ఎస్ఐబీ, ఏపీఎస్పీ విభాగాల్లోనూ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్లారు. అనంత‌రం రాష్ట్రానికి వ‌చ్చిన గౌత‌మ్ స‌వాంగ్ విజ‌య‌వాడ క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -