Monday, May 6, 2024
- Advertisement -

ప్ర‌ముఖ బహుభాషా నటుడు గిరీష్ కర్నాడ్ కన్నుమూత‌…

- Advertisement -

ప్రముఖ బహుభాషా నటుడు, నాటక రచయిత గిరీష్ కర్నాడ్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 81 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్‌ కర్నాడ్‌.. సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

రంగస్థల నటుడిగా, రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్దిగాంచిన ఆయన.. శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌, ధర్మచక్రం, రక్షకుడు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు. గిరీష్ కర్నాడ్ మహారాష్ట్రలోని మాథెరన్‌లో 1938 మే 19న జన్మించారు. సినిమాల్లో నటిస్తూనే.. పలు రచనలు చేసి 1998లో జ్ఞానపీఠ్‌ అవార్డును అందుకున్నారు. తుఝ, తలిదండ ఆయన కన్నడ ప్రముఖ రచనలు కాగా.. వంశవృక్ష అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు.హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో గిరీష్ కర్నాడ్ నటించారు.

ఇక సినిమాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఆయన్ని వరించాయి. తెలుగులో ‘ధర్మచక్రం’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘కొమరం పులి’ చిత్రాల్లో ఆయన నటించారు. ‘ధర్మచక్రం’లో వెంకటేష్ తండ్రిగా, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో చిరంజీవి తండ్రిగా నటించిన గిరీష్ కర్నాడ్ తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -