Friday, April 26, 2024
- Advertisement -

ఇక్కడ మరో రికార్డ్.. వామ్మో 10 లక్షల సంతకాలు..!

- Advertisement -

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విశాఖలో 10 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని.. సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్​లర్ జీ.ఎస్.ఎన్ రాజు, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సాహితీవేత్త తెలకపల్లి రవి ప్రారంభించారు.

స్టీల్ ప్లాంట్​ను పరిరక్షించుకునేందుకు.. అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజలు సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైందని తెలకపల్లి రవి అభిప్రాయపడ్డారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సింది పోయి.. కొన్ని పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

రాష్ట్రానికి భాజపా ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆగ్రహించారు. విభజన హామీలను గాలికొదిలేసి.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు చూస్తున్న మోదీ సర్కార్ పై అందరూ కలిసి ఒత్తిడి తేవాలని తెలకపల్లి రవి కోరారు.

తెలంగాణ ను మించి పోయిన ఆంధ్ర ప్రదేశ్.. అమ్మో భయం భయం..!

జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి

మళ్లీ తెరపైకి గాలి జనార్దన్​రెడ్డి.. ఈసారీ ఎన్ని కోట్లు అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -