Friday, May 3, 2024
- Advertisement -

మంగ‌ళ‌వారం కోర్టుకు హాజ‌రుకావాల్సిందేన‌న్న హైకోర్టు..

- Advertisement -

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణకు హైకోర్టులో చుక్కెదురైంది. సేమ్ టు సేమ్…గ‌తంలో జ‌గ‌న్ పాదయాత్ర చేస్తున్న నేపధ్యంలో కోర్టు విచారణ నుండి వ్యక్తిగత మినహాయింపు కోరుతూ గతంలో జగన్ వేసిన కేసును సిబిఐ కోర్టు కొట్టేసింది. దాంతో పాదయాత్ర మధ్యలో ప్రతీ శుక్రవారం విరామం తీసుకుని జగన్ కోర్టుకు హాజరవుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆ అంశాన్ని రాధాకృష్ణ తన మీడియాలో బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు అలాంటి సీనే రాధాకృష్ణ‌కు ఎదుర‌య్యింది.

క‌ట్ చేస్తే ఓ పరువునష్ట దావాలో విచారణ నుండి తనకు వ్యక్తిగత మినహాయింపును కోరుతూ రాధాకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ను కోర్టు కొట్టేసింది. గ‌తంలో జగన్ ప్రధానమంత్రి నేంద్రమోడిని కలిసినపుడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఎంత అవసరమో తాను ప్రధానికి వివరించానంటూ తర్వాత జగన్ స్వయంగా మీడియాతో చెప్పారు. కాని ఆంధ్ర‌జ్యోతి త‌న సొంత క‌థ‌నాల‌ను ప్ర‌చురించారు.

రాధాకృష్ణ ప్రచురించిన, ప్రసారం చేసిన కథనాలు తమ నాయకుడు జగన్ పరువుకు నష్ట కలిగించే విధంగా ఉందంటూ వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి నాంపల్లి కోర్టులో ఓ కేసు వేసారు. పోయిన నెల‌లో కోర్టుకు రాధాకృష్న హాజ‌రు కావాల్సింది కాని అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో కోర్టుకు రాలేకపోతున్నామంటూ చెప్పడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాజాగా త‌న‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని రాధాకృష్న పెట్ట‌కున్న పిటీష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో చేసేది లేక మంగళవారం నాంపల్లి కోర్టులో జరిగే విచారణకు రాధాకృష్ణ వ్యక్తిగతంగా హాజరుకాక తప్పదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -