బ‌య‌ట‌కు రావాలంటే బెంబేలెత్తుతున్న ప్ర‌జ‌లు

- Advertisement -
High Temperatures in telugu states

తెలుగు రాష్ట్ర‌ల్లో   ఎండ‌లు మండిపోతున్నాయి.సూర్యుడి ప్ర‌తాపాగ్నికి ప్ర‌జ‌లు మ‌ల‌మ‌ల మాడిపోతున్నారు.ఎప్పుడూ లేనంత‌గా రికార్డు స్తాయిలో  ఉష్ణోగ్ర‌త‌లు రికార్డు స్తాయిలో న‌మోద‌వుతున్నాయి.దీంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటే జంకుతున్నారు.

ఉద‌యం 7 నుంచే ఎండ‌లు మొద‌లు కావ‌డంతో ప్ర‌జ‌లు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు బ‌య‌ట‌కు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ఇక రాష్ట్రంలో ప్ర‌ధానంగా భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా మంగళవారం నిప్పుల కొలిమిని తలపించింది.ఈప్రాంతంలో ఎక్కువ‌గా బొగ్గుగ‌నులు ఉండ‌టంతో సాధార‌నంగా ఉష్నోగ్ర‌త‌లు అత్య‌ధికంగానే ఉంటాయి. జిల్లా కేంద్రం కొత్తగూడెంలో ప్రస్తుత సీజన్‌లోనే అత్యధికంగా జిల్లాలోని భద్రాచలంలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. పాల్వంచ మండలం యానాంబైలు గ్రామంలో 44.1 డిగ్రీలు, దుమ్ముగూడెంలో 44 డిగ్రీలు, భద్రాచలం రూరల్‌లో 43.9 డిగ్రీలు, ఖమ్మం జిల్లా వైరాలో 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక మహబూబ్‌నగర్‌లో 42.6, ఖమ్మంలో 42.2, నల్లగొండ, నిజామాబాద్‌లో 41 డిగ్రీలు, జనగామలో 39 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక హైద‌రాబాద్‌లో కూడా ఉష్ణోగ్ర‌త‌లు40 డిగ్రీలు భారీగానే న‌మోద‌వుతున్నాయి.మేలో ఉండాల్సిన ఉష్ణోగ్ర‌త‌లు  ఇప్పుడే న‌మోద‌వుతున్నాయి. నిత్యం ర‌ద్దీగా  ఉండే హైద‌రాబాద్ లోని  ప్ర‌ధాన కూడ‌ల్లుకూడా జ‌నాలు లేక వెల‌వెల‌బోతున్నాయి.ఉద‌య‌మే ఎండ‌లు మండిపోవ‌డంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావాలంటే జంకుతున్నారు.మ‌ధ్యాహ్నం రోడ్ల‌మీద‌కు  వ‌చ్చేందుకు స‌హ‌సించ‌డంలేదు.అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో రోడ్ల‌న్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.ఇప్పుడే ఎండ‌లు రికార్డుస్తాయిలో నమోద‌వుతుంటే ఇక మేలో ప‌రిస్తితేంట‌నీ జ‌నాలు జంకుతున్నారు. 

వచ్చే నెల వడగాడ్పుల తీవ్రత మరింతగా ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. మే నెలలో గరిష్టంగా 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుతాయని, దీంతో వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని తెలిపింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా అంటే వడగాడ్పులుగా లెక్కిస్తారని, ఆరు డిగ్రీల కన్నా అధికంగా ఉంటే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారని చెప్పింది. వడగాడ్పులు ఉన్నప్పుడు వేసవి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని హెచ్చరించింది.ఉద‌యం 9 గంట‌ల‌నుంచి సాయంత్రం 4గంట‌ల వ‌ర‌కు అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌నీ ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించారు అధికారులు.

బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌జ‌లు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నీ ఆరోగ్య నిపునులు హెచ్చ‌రిస్తున్నారు.లేక‌పోతే ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుందంటున్నారు.అవ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రాకుండా ఉంటే మంచిదంటున్నారు.అత్వ‌స‌ర ప‌నులు నిమిత్తం బ‌య‌ట‌కు వ‌చ్చేప్ర‌జ‌లు గోడుగుల‌ను త‌ప్ప‌నిస‌రిగా వాడాల‌నీ త‌గిన‌న్ని నీళ్లు… ఎక్కువ‌గా ద్ర‌వ ఆహార ప‌దార్థాలు తీసుకోవాల‌నీ సూచించారు. ఆరోగ్య‌నుపునులు సూచించిన స‌ల‌హాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల‌…ఇక మీఆరోగ్యం మీచేతుల్లోనే ఉంది.ప్ర‌జ‌లూ ఇక జాగ్ర‌త్త‌.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -