Thursday, March 28, 2024
- Advertisement -

27 నుంచి తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు

- Advertisement -

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ప్రిల్ 27 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమల్లో ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈరోజు సెలవులపై ఆమె ప్రకటన చేశారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు ఆరు వేలకు మించి కరోనా కేసులు నమోదు కావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు చేసి 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేసినట్లు మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు మంత్రి తెలిపారు.

పాఠశాలలు, కాలేజీ పున:ప్రారంభంపై జూన్ 1న నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినంగా పరిగణిస్తామని మంత్రి పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ షర్మిల

విషమంగా సబ్బం హరి ఆరోగ్యం…

స్టార్ కమెడియన్ పొట్టి వీరయ్య కన్నుమూత

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -