Saturday, April 20, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ షర్మిల

- Advertisement -

రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రలో 35లక్షల మందికిపైగా టీకా తీసుకున్నారు. రెండు-మూడు రోజుల్లో నాకు అవసరమైన వైద్య పరీక్షలు జరిగి, పూర్తి స్వస్థత చేకూరిన తరువాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తా అని అన్నారు ముఖ్యమంత్రి.

రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని సిఎం ప్రకటించడం అభినందనీయమని, కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకున్న సిఎం కెసిఆర్‌కు వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు. చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషమని, ప్రజల మాట, మా మాట విని అందరికి వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు కెసిఆర్‌కి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలను మరింత ఆదుకోవాలని సర్కారుకు షర్మిల విజ్ఞప్తి చేశారు.

తప్పదు.. ఢిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్‌: కేజ్రీవాల్

క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన మిథాలి రాజ్!

మ‌హారాష్ట్రలో మ‌ద్యం దొర‌క‌క శానిటైజ‌ర్ తాగిన వైనం.. ఏడుగురి మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -