Sunday, April 28, 2024
- Advertisement -

స్టార్ కమెడియన్ పొట్టి వీరయ్య కన్నుమూత

- Advertisement -

పాత తరం నటుల్లో స్టార్ కమెడియన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన వారిలో పొట్టి వీరయ్య ఒకరు. ఎన్టీఆర్, కాంతారావు ఫాంటసీ సినిమాల్లో ఖచ్చితంగా పొట్టి వీరయ్య ఉండాల్సిందే. ముఖ్యంగా విఠలాచార్య సినిమాల్లో పొట్టి వీరయ్య ఎన్నో కీలక పాత్రల్లో నటించారు. టాలీవుడ్ నటుడు పొట్టి వీరయ్య తుదిశ్వాస విడిచారు.  యన వయసు 74 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టి వీరయ్య తన నివాసంలో కన్నుమూశారు.  పొట్టి వీరయ్య భార్య మల్లిక 2008లోనే మరణించారు. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

పొట్టి వీరయ్యది ప్రేమ వివాహం అని పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఆయన కూతురు కూడా నటిగా స్థిరపడింది. పొట్టి వీరయ్య 70, 80వ దశకాల్లో అత్యధిక సంఖ్యలో సినిమాల్లో నటించారు. గజదొంగ, జగన్మోహిని, గోల నాగమ్మ, యుగంధర్ తదితర హిట్ చిత్రాల్లో నటించారు. పొట్టి వీరయ్య తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం వంటి ఇతర దక్షిణాది భాషల్లోనూ నటించారు.

సూర్యాపేట తాలూకా ఫణిగిరి గ్రామం ఆయన స్వస్థలం. విఠలాచార్య వంటి దర్శకులను కలిసి సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. తన కెరీర్ లో దాదాపు 500 చిత్రాల్లో నటించారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

తప్పదు.. ఢిల్లీలో మరో వారంపాటు లాక్‌డౌన్‌: కేజ్రీవాల్

కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి!

కరోనా ఉధృతిపై ప్రధాని మన్ కీ బాత్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -