Friday, May 3, 2024
- Advertisement -

#Google Translateలో ఎక్క‌వ‌గా టైప్ చేసే ప‌దాలు ఇవే

- Advertisement -

గూగుల్‌… ఇప్పుడు ఈ సెర్చింజ‌న్ లేనిదే రోజు గ‌డ‌వ‌ని ప‌రిస్థితి వ‌చ్చేసింది. స్మార్ట్‌ఫోన్లు వాడేవారికి.. గూగుల్ ఒక దిక్సూచి అని చెప్ప‌వ‌చ్చు. నెటిజన్లకు గూగుల్ లేనిదే పొద్దుగడవట్లేదు. ఇక అందులో ఉన్న ట్రాన్స్‌లేట‌ర్ ఫిచ‌ర్ ఉప‌యోగం అంతా ఇంతా కాదు. తెలియ‌ని ప‌దాలు టైప్ చేయ‌డం.. అర్థాలు తెలుసుకోవ‌డం కామ‌న్‌గా మారింది.

రోజూ సుమారు 100 బిలియన్ అంటే 10 వేల కోట్ల పదాలను గూగుల్ ట్రాన్స్‌లేట్ చేస్తోందని గూగులే స్వయంగా ప్రకటించింది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. మ‌రి ఏ ప‌దాల‌ను ఎక్క‌వ‌గా ప్ర‌జ‌లు సెర్చ్ చేస్తున్నారో తెలుసా?
ఇంకేంటో అనుకోకండి? రోజూ గూగుల్ ట్రాన్స్‌లేట్ ఎక్కువగా టైప్ చేస్తున్న పదాలుగా హౌ ఆర్ యు, ఐ లవ్ యు, థ్యాంకూ.. వంటివే నిలిచాయి.

యూజర్లు ఎక్కువగా ఈ వాక్యాలనే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అనువదిస్తున్నారట. #GoogleTranslate పేరుతో ఓ యాడ్ క్రియేట్ చేసి రిలీజ్ చేసింది గూగుల్‌.

ఇందులో భాగంగా 100 బిలియన్ వర్డ్స్ పేరుతో యూట్యూబ్, ట్విట్టర్‌లో ఈ యాడ్ పోస్టు చేసింది గూగుల్. ఈ క్రమంలో గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో ఎక్కువగా How are you?, I love you, Thank you అనే పదాలనే ఎక్కువగా టైప్ చేస్తున్నారట. ఇంకేముంది.. 100 బిలియన్స్ వర్డ్స్‌ను గూగుల్ ఎలా ట్రాన్స్‌లేట్ చేసిందో ఈ వీడియో ద్వారా ఓ లుక్కేయండి.

https://www.youtube.com/watch?v=uXfJc8up6cM

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -