Friday, May 3, 2024
- Advertisement -

వైఎస్ ష‌ర్మిల కేసులో ఒక‌రిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు..

- Advertisement -

సామాజిక మాధ్య‌మాల్లో వైఎస్ ష‌ర్మిల‌పై అస‌భ్యక‌రంగా పోస్టులు పెట్టిన కేసులో హైదార‌బాద్ సైబర్ క్రైం  పోలీసులు ముంద‌డుగు వేశారు. ష‌ర్మిల‌పై పోస్ట్ పెట్టిన యువ‌కున్ని అదుపులోకి తీసుకున్నారు. ఎట్ట‌కేల‌కు సామాజిక మాధ్యమాలు వేదికగా షర్మిలను అప్రదిష్ట పాలు చేసేందుకు జరిగిన కుట్రను సైబర్ క్రైం  పోలీసులు చేధించారు ప్ర‌కాశం జిల్లాకు చోడ‌వ‌రానికి చెందిన పెద్దిశెట్టి వెంట‌కేష్‌ను అరెస్ట్ చేశారు. వెంక‌టేష్ గుంటూరులోని ఓ ప్ర‌యివేటు కాలేజీలో ఎమ్‌సీఏ చ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.ఇదే కేసులో మ‌రికింద‌రిని పోలీసులు విచారించ‌నున్నారు.

సామాజిక మాధ్య‌మాల్లో త‌న‌పై అస‌భ్యంక‌రంగా పోస్టులు పెట్టార‌ని సీసీఎస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది ష‌ర్మిల‌. అప్ప‌టినుంచి ఈ కేసును ఛేదించేందుకు ప్ర‌త్యేక బృందాలు ప‌నిచేస్తున్నాయి. నిందుతుడు వెంక‌టేష్‌తోపాటు మ‌రికింత మందిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. నిందితునిపై ఐపీసీ సెక్స‌న్ 509, 67 ఐటీ యాక్ట్ స‌హా ప‌లు సెక్స‌న్లు పోలీసులు న‌మోదు చేశారు.

ష‌ర్మిల‌పై సామాజిక మాధ్య‌మాల్లో అస‌భ్య‌క‌రంగా పోస్ట్‌లు ఎవ‌రు పెట్టారో వివ‌రాల‌ను ఇవ్వాల‌ని సీసీఎస్ పోలీసులు గూగుల్‌ను కోరారు. గూగుల్ ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు ఈకేసులో పురోగ‌తి సాధించారు. నిందితుల‌ను హైద‌రాబాద్ త‌ర‌లించి రేపు కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు.

మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే అనేక వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్‌కు నోటీసులు పంపించిన పోలీసులు… ఐపీ అడ్రస్‌ల ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  ఈ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

ఇప్పటి వరకు వైఎస్ షర్మిలపై గాసిప్స్ ప్రచారం చేసిన 16 యూట్యూబ్ లింక్ లను సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వారందర్నీ ప్రశ్నించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆఖరికి 6 యూట్యూబ్ ఛానెల్స్ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు.  అరెస్ట్ అయిన వెంకటేశ్వర్ ఒక రాజకీయ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -