Monday, May 6, 2024
- Advertisement -

పాక్ నుంచి వలస.. భారత్ లో పౌరసత్వం అందజేత..!

- Advertisement -

పాకిస్థాన్​ నుంచి వలస వచ్చి రాజస్థాన్​లో స్థిరపడిన కొందరికి భారత పౌరసత్వ సవరణ చట్టం-1955 ప్రకారం నేడు భారత పౌరులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పౌరసత్వం అందుకున్న వెంటనే అక్కడ వందేమాతరం, హిందుస్థాన్​ జిందాబాద్​ నినాదాలు మారుమోగాయి. భారత పౌరసత్వం లేక అనేక ఏళ్లుగా వారంతా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. రాజస్థాన్​లోని జైపుర్​ పాలనాధికారి చేతులమీదుగా భారత పౌరసత్వ ధ్రువీకరణ పత్రాలు అందుకుంటున్న సమయంలో వారి కళ్లు చెమర్చాయి.

అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ భారత పౌరసత్వం కల్పిస్తామని, దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అనర్హులుగా తేలినవారిని తిరిగి పంపిస్తామని కలెక్టర్​ అన్నారు. 2009కి ముందు దరఖాస్తు చేసుకున్న వారందరికీ.. పాత చట్టానికి అనుగుణంగా పౌరసత్వం కల్పించాలని నిమితేకం సంస్థ అధ్యక్షుడు జై అహుజా విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వీరంతా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -