Monday, May 6, 2024
- Advertisement -

ఈ త్రైమాసికంలో మూడు వేల కోట్లు పైనే లాభం

- Advertisement -

ప్రఖ్యాత ఐటి కంపెనీ ఇన్ఫోసిస్‌కు లాభాలు అదిరాయి. ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకంగా 3,597 కోట్ల రూపాయల లాభం వచ్చింది. శుక్రవారం నాడు ఆ సంస్ధ తన ఆర్ధిక వ్యవహారాలను ప్రకటించింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 16 శాతం పెరిగిందని, దీంతో తమ కంపెనీ 3597 కోట్ల రూపాయల లాభాలను గడించిందని కంపెనీ పేర్కొంది.

ఈ కంపెనీ టర్నవర్ కూడా 23.4 శాతం పెరిగి 16, 550 కోట్ల రూపాయలకు చేరుకోవడం విశేషం. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాబడి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని కంపెనీ ఆశిస్తోంది. కంపెనీ మరిన్ని లాభాలు రాబట్టేందుకు కంపెనీ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా వ్యూహం ఫలించందని కంపెనీ భావిస్తోంది.

ఆయన వ్యూహాల కారణంగా కంపెనీకి కొత్త కాంట్రాక్టులు వచ్చాయని, ఇంతకు ముందు టాటా కన్సల్టెన్సీ, కాగ్నీ జెంట్ వంటి కంపెనీలు సొంత చేసుకుంటున్న మార్కెట్ వాటాను ఇప్పుడు ఇన్ఫోసిస్ తన సొంతం చేసుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -