భారత్‌లోకి ఒమైక్రాన్?

- Advertisement -

భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్ కలకలం మొదలైందా ? ఆఫ్రికా నుంచి ఇండియాకు ఎవరైనా వచ్చారా ? ఒకవేల వస్తే ప్రభుత్వం వారిని పరీక్షించిందా లేదా ? అనే సందేహాలు మొదలయ్యాయి.

ఒమైక్రాన్ ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వైరస్. ఈ వైరస్ కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుందని వైద్యుల తెలిపారు. దీని ప్రభావం భారత్‌పై పడుతే దాని తీవ్రత కోవిడ్ సెకండ్‌ వేవ్‌ కంటే ఎక్కువగా ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

నిన్నా మొన్నటి వరకు ఆఫ్రికా నుంచి ఇండియాకు విమాన సర్వీసులు కొనసాగాయి. గత రెండు రోజుల్లో ఆఫ్రికా దేశాల నుంచి ఇండియాకు సుమారు 600 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో కొంతమంది అడ్రస్ దొరకకపోవడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఎయిర్‌పోర్టులో ఇచ్చిన అడ్రస్ తప్పుగా ఉండటంతో అధికారులు ప్రయాణికలును గుర్తించడంలో నానా తంటాలు పడుతున్నారు.

ఇందులో ఎవ్వరికైనా ఒమైక్రాన్ సోకి ఉంటే కోవిడ్ త్రాడ్‌ వేవ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దేశ ప్రజలు విదేశాల నుంచి వచ్చిన వారికి దూరంగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు వెళ్తే ఖచ్చితంగా మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.

ప్రియురాలిని కత్తితో దాడి చేసి చంపిన ప్రియుడు

గరీబొడి జేబుకు చిల్లు

పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -