Saturday, April 27, 2024
- Advertisement -

హై కోర్టు కి జనసేన.. ఎన్నికల వేడి మామూలుగా లేదు..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఎన్నికలను ఇప్పటికే టీడీపీ బహిష్కరించగా,  ఎన్నికల ప్రక్రియ మొదటి నుంచి ప్రారంభించాలని బీజేపీ  కోర్టు మెట్లు ఎక్కింది. ఇక ఏకంగా టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించిన విషయం తెలిసిందే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని పేర్కొంది.పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరింది.

రాజకీయ పార్టీల అభిప్రాయం కూడా తీసుకోలేదని పిటిషన్‌లో ప్రస్తావించింది. ఎన్నికల ప్రక్రియ మొదటినుంచి ప్రారంభించాలని కోరుతూ ఇప్పటికే భాజపా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై మధ్యాహ్నం 2.15 గంటలకు న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా, ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఏప్రిల్ 1న నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. 10న ఫలితాలు అనౌన్స్ చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించ నున్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే ఈనెల 9న రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. 

తిరుపతి ఆలయం పై కొత్త వివాదం.. అర్చకులకు మళ్లీ అవకాశం..!

స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విజయలక్ష్మి సినీ రంగ ప్రవేశం.. ఫస్ట్ లుక్ వైరల్!

తెలంగాణ కరోనా మళ్లీ పంజా విసురుతోంది.. కొత్త‌గా 1,078 కేసులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -