సర్కారు వారి పాట సినిమా నుంచి మరో అప్ డేట్

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వారి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. మే 12న సర్కారు వారి పాట మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ తో మేకర్స్ బిజీగా ఉన్నారు. మే 2న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‪ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ పోస్టర్‪ను విడుదల చేశారు. రెండు చేతుల్లో తాళాల గుత్తులు పట్టుకుని రౌడీ గ్యాంగ్ తో ఫైట్ చేస్తున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిరేపుతోంది.

- Advertisement -

మహేశ్ బాబు మునుపెన్నడూ లేని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడని ఈ పోస్టర్ చూస్తే అర్థమైపోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కుమార్తెకు బంఫర్ ఆఫర్ ఇచ్చిన చిరు

రాజమౌళి, మహేశ్ మూవీపై లేటెస్ట్ అప్ డేట్

మహేశ్ మూవీలో పెళ్లి సందడి బ్యూటీ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -