Thursday, May 9, 2024
- Advertisement -

ఎస్బీఐకు టోపీ పెట్టాడు.. రూ.వెయ్యి కోట్ల కుంభ‌కోణం

- Advertisement -

బ్యాంకు కుంభ‌కోణాలు బ‌ట్ట‌బ‌య‌లు అవుతున్నాయి. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ కుంభ‌కోణం భారీగా జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత మ‌రికొన్ని జ‌రిగాయి. ఇప్పుడు ప్ర‌భుత్వ రంగంలో అతి పెద్ద బ్యాంకుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేరిపోయింది. మరో గోల్డ్ కంపెనీ దుకాణం మూసేసి స్టేట్ బ్యాంక్ ఇండియాకు అక్షరాల వెయ్యి కోట్ల రూపాయ‌లు ముంచారు.

తమిళనాడువ్యాప్తంగా కనిష్క్ జ్యువెలర్స్ ఉన్నాయి. 14 బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.824 కోట్ల చెల్లించలేదంటూ సీబీఐకి ఎస్‌బీఐ ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుతో ఈ కుంభ‌కోణం వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన కనిష్క్ గోల్డ్ జ్యువెలర్స్ తమిళనాడు వ్యాప్తంగా పెద్ద పెద్ద దుకాణాలు ప్రారంభించారు. దీనికోసం బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.824 కోట్లు అప్పు తీసుకున్నారు య‌జ‌మాని భూపేశ్‌కుమార్ జైన్. ఈ జ్యువెల‌ర్స్‌కు డైరెక్టర్‌గా అతడి భార్య నీతా జైన్ వ్య‌వ‌హరిస్తున్నారు.

14 బ్యాంకుల కన్సార్టియం ఎస్బీఐ నుంచి అప్పులు తీసుకుంది. విడతలవారీగా ఇప్పటి వరకు మొత్తం రూ.824 కోట్లు తీసుకున్నది.
అప్పుతిరిగి చెల్లించడంలో కనిష్క్ గోల్డ్ జ్యువెలర్స్ విఫలమైంది. ఎలాంటి సమాచారం లేకుండా కొన్ని దుకాణాలను మూసివేయడం, రికార్డులు తారుమారు చేయడం వంటివి చేసినట్లు బ్యాంక్ గుర్తించి వెంటనే సీబీఐకి ఫిర్యాదు చేసింది ఎస్‌బీఐ.

భూపేశ్‌కుమార్ జైన్ కుటుంబం విదేశాలకి వెళ్లిపోయినట్లు భావిస్తున్నారు. దేశంలో అతడి ఆచూకీ లభ్యం కావడం లేదు. మారిషస్ వెళ్లినట్లు తెలుస్తోంది. 2017 నవంబర్‌లోనే కుమార్ జైన్‌ను అప్పు ఎగవేతదారుడిగా పలు బ్యాంకులు ప్రకటించాయి. ఆ క్రమంలోనే రూ.20 కోట్లు ఎక్సైజ్ ప‌న్ను ఎగ్గొట్టిన కేసులో అరెస్ట‌య్యాడు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయిన భూపేశ్‌కుమార్.. కనిపించకుండా వెళ్లిపోయాడు. చెన్నై, ముంబై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లో కనిష్క్ గోల్డ్ జ్యువెలరీస్ పేరిట ఫ్రాంఛైజీలు ఉన్నాయి. వారి నుంచి కూడా భారీ మొత్తంగా డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -