కేరళాలో సంపూర్ణ లాక్ డౌన్!

- Advertisement -

దేశ వ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మనిషిని చూసి మనిషి భయపడే పరిస్థితి నెలకొంది. కరోనాతో మానవ సంబంధాలు పూర్తిగా నశించిపోతున్నాయి. కరోనా కట్టడి చేయడానికి పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ,మహారాష్ట్ర మరికొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ మే 8 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

- Advertisement -

కేరళలో నిన్న ఒక్కరోజు 41 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్ లో ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో టెస్ట్ పాజిటివిటీ రేటు అధికంగా ఉన్నందున కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని విజయన్ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -